ప్రశాంతంగా ముగిసిన సహకార సంఘాల ఎన్నికలు

15 Feb, 2020 21:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌) ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 747 ప్యాక్స్‌లకు (వాటిల్లోని 6,248 డైరెక్టర్‌ పదవులు) జరిగిన ఎన్నికల్లో 79.36 శాతం ఓటింగ్‌ జరిగినట్లు వెల్లడించింది. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 89.82 శాతం ఓటింగ్‌ జరిగింది. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో 87.99 శాతం ఓటింగ్‌ జరిగినట్లు ఎన్నికల అథారిటీ వెల్లడించింది. అత్యంత తక్కువగా నారాయణపేట జిల్లాలో కేవలం 55.78 శాతం మాత్రమే ఓటింగ్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.48 లక్షల మంది ఓటర్లకుగాను, 9.11 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

>
మరిన్ని వార్తలు