రైతులకు అసౌకర్యం కలగొద్దు

24 Mar, 2020 03:28 IST|Sakshi

అధికారులకు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలు

నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాలకు గ్రీన్‌చానల్‌ ఏర్పాటుకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు చెం తకే వెళ్లి ధాన్యం కొనుగోళ్లు జరపాలని సూ చించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన పరిస్థితులలో ప్రభుత్వ ఆంక్షలకు అడ్డురాకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ మంది రైతులు గుమి కూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి బీఆర్కేఆర్‌ భవన్‌లో సమీక్షా సమా వేశం నిర్వహించారు. సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టు విషయంలో పరిమితులు అవసరం లేదని, రూ.25 వేల కోట్లకు బ్యాంక్‌ గ్యారంటీకై ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారన్నా రు. గ్రామాల వారీగా ధాన్యం అ మ్మకానికి వచ్చే పరిస్థితులు అం చనా వేసి కొనుగోళ్లకు టోకెన్‌ ద్వా రా ఏర్పాట్లు చేయాలన్నారు.

అకాల వర్షాలు వస్తే కొనుగోలు కేం ద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లను సరఫ రా చేయాలన్నారు. టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని, కొత్తగా 60 వేల టార్పాలిన్లను త్వరగా కొనుగోలు చేయాలని మార్కెటింగ్‌ శాఖ కు ఆదేశాలు జారీ చేశారు. తేమ ని ర్ధారణ యంత్రాలు కొరత లేకుండా చూసుకోవాలని, గన్నీ బ్యాగులను ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులు ప్రాథమిక సహకార సంఘా లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణ వ్యవసాయ మార్కెట్ల వరకూ రైతులు ధా న్యం తెచ్చే అవకాశం రానివ్వమని చెప్పారు. రబీలో పండిన మొక్కజొన్నలను రూ.1,760 కి కొనుగోలు చేయాలని తెలిపారు. పౌల్ట్రీ సంక్షోభం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  విధిగా ఏ గ్రామ రైతు ఆ గ్రామంలోనే ధాన్యం అమ్మకాలు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు.

నిత్యావసరాలకు గ్రీన్‌ ఛానల్‌.. 
ఇతర రాష్ట్రాల, రాష్ట్రం నుంచి పట్టణాలు, గ్రామాలకు వచ్చే పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా ఆగిపోకుండా గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. టోల్‌ ప్లాజాలు చెక్‌ పోస్ట్‌ల వద్ద అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, దీనిని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ జీవో విడుదల చేశామన్నారు. విత్తనాలు, ఫర్టిలైజర్‌ ఈసీ యాక్ట్‌లో ఉన్నందున వాటి రవాణా, సరఫరాపై ఎటువంటి ఆంక్షలుండవని వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ గంగారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, సహకార శాఖ కమిషనర్‌ వీరబ్రహ్మయ్య తదితరులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు