10 ఎకరాలకే ‘రైతుబంధు’

31 Aug, 2019 02:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రైతుబంధు పథకంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నా రైతుబంధు సొమ్ము అందజేయాలనే నిబంధనను మార్చాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ, పది ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదన పంపినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థికమాంద్యం నేపథ్యంలో దీన్ని వచ్చే రబీ నుంచి లేదా ఆ తర్వాత వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

‘‘నిబంధనల్లో మార్పు చేసినా ప్రతీ రైతుకు రైతుబంధు సొమ్ము అందుతుంది. అయితే పదెకరాలకు మించి భూమి ఉన్నా పదెకరాల వరకు మాత్రమే సొమ్ము ఇవ్వా లనేది ఆలోచన’’అని ఆ వర్గాలు వివ రించాయి. అయితే ముఖ్యమంత్రి దీనిపై అంతగా సుముఖంగా లేరని తెలిసింది. ఎంత భూమి ఉన్నా ఇస్తా మని రైతులకు హామీ ఇచ్చినందున, మాట తప్పకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆర్థికశాఖ మాత్రం పదెకరాల సీలింగ్‌ అమలు చేస్తే ఏడాదికి దాదాపు రూ.2వేల కోట్ల వరకు మిగులుతాయని, తద్వారా అనేక శాఖల్లో అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఖర్చు చేయడానికి వీలు పడుతుందని చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ నుంచి వచ్చిన ప్రతిపాదన ప్రకారమే వ్యవసాయశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

ఎకరానికి రూ.10వేలు... 
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత ఖరీఫ్, రబీల్లో కలిపి ఎకరానికి రూ.8వేల చొప్పున రైతులకు అందజేసింది. 53 లక్షల మంది రైతులకు దాదాపు రూ.10వేల కోట్లు చెల్లించింది. ఈ ఏడాది నుంచి ప్రతి ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించింది. ఆ మేరకు ఇప్పటికే ఖరీఫ్‌లో ఎకరాకు రూ.5వేల చొప్పున అందజేస్తోంది.

ఇప్పటివరకు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,400 కోట్లు జమ చేసింది. మరో 14 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో దాదాపు రూ.2వేల కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే, వంద ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతుబంధు ఇస్తుండటంతో గ్రామాల్లోనూ, వివిధ వర్గాల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనిక రైతులకు ఇవ్వాల్సిన అవసరముందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుబంధుకు పదెకరాలు సీలింగ్‌ అమలు చేస్తే ఇలాంటి విమర్శలు వచ్చ అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ ఈ మేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త సేవల్లోకి తపాలాశాఖ

'డై' యేరియా!

అంతా అక్రమార్కుల ప్లాన్‌ ప్రకారమే!

ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు!

అఖిలపక్ష నేతల పొలికేక

క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం

రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీపీఎస్‌ ఉద్యోగులు

ఎకరం లేఅవుట్‌ ఏదీ ఆదాయం?

స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం

మలుపు తిరుగుతున్న శ్రీనివాస్‌ మృతి కేసు

రైతులకు ఇన్సూరెన్సు తగ్గించిన సహకార బ్యాంకు!

ఐసీడీఎస్‌లో అవినీతి కోణం

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

పెట్రోల్‌ బంకుల్లో కల్తీ దందా

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

'బవొబాబ్‌' 500 ఏళ్లు

వారం రోజుల్లో మద్యం దుకాణాలకు టెండర్లు

అనగనగా ఓ రచయిత్రి

‘ప్లాంట్‌ గణేశ్‌’ విగ్రహాలు

అభాసుపాలైన టాస్క్‌ఫార్స్‌..!

సెల్‌ టవరెక్కి మహిళ హల్‌చల్‌

స్పందించిన పోలీస్‌ హృదయం

మత్స్యగిరీశుడికి మహర్దశ!

ఆక్వాలో నంబర్‌ వన్‌కు చేరాలి

‘కరెంట్‌’ రికార్డు! 

రేవంత్‌పై భగ్గుమన్న విద్యుత్‌ ఉద్యోగులు 

లుక్కుండాలె.. లెక్కుండాలె..!

అందుబాటులోకి మరో రెండు అర్బన్‌ పార్క్‌లు 

‘విద్యుత్‌’పై శ్వేతపత్రం ఇవ్వాలి

సోషల్‌ మీడియా బూచోళ్లు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ