ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

4 May, 2018 06:50 IST|Sakshi
మఠంపల్లి : జెండాను ఆవిష్కరిస్తున్న నాగన్నగౌడ్‌

గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లిలో గురువారం గడ్డిపల్లి మిల్లు హమాలీ యూనియన్‌ ఐఎన్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్‌ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం తమదేనన్నారు. కార్మికుల సంక్షేమమే సంఘం ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షుడు గుండు గుర్వయ్యగౌడ్, ఎంపీటీసీ సుందరి నాగేశ్వరరావు, బెల్లంకొండ గుర్వయ్యగౌడ్, సలిగంటి జానయ్య, ముక్కంటి వెంకన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు. 


దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా సభ్యత్వం

గాల్లో పని చేస్తున్న కార్మికులు మూడు కోట్లకు పైబడి సభ్యత్వం కలిగి ఐఎన్‌టీయూసీ అతిపెద్ద యూనియన్‌గా కొనసాగుతుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్‌ అన్నారు. గురువారం మండలంలోని వేములూరు ప్రాజెక్ట్‌పై నిర్మించిన ఎన్‌ఏటీఎల్‌ పవర్‌ప్లాంట్‌ ఐఎన్‌టీయూసీ కార్మికులతో కలిసి 71వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కేక్‌ కట్‌ చేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చ లిగంటి జానయ్య, నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గురవ య్య, కరుణాకర్‌రెడ్డి, కోటేష్, ముక్కంటి, రామ్మూర్తి, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, సైదిరెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు