అఖిల్‌కు మరో అవకాశం

22 Jul, 2019 07:42 IST|Sakshi
కిల్‌మంజారో పర్వతంపై అఖిల్‌(ఫైల్‌)

నేపాల్‌లోని మౌంట్‌ కనామో పర్వతాన్ని అధిరోహించే చాన్స్‌

ఆగస్టు 4 లోపు నేపాల్‌కు.. 

సాక్షి, హన్మకొండ: వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం దేశపల్లి గ్రామానికి చెందిన రాసమల్ల రవీందర్, కోమల దంపతుల కుమారుడైన పర్యతారోహకుడు రాసమల్ల అఖిల్‌కు మరో అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆర్థిక స్థోమత లేక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికే ఆప్రికా దేశంలోని కిల్‌మంజారో, ఉత్తరాఖండ్‌లోని పంగర చుల్లా పర్వతాలాను విజయవంతంగా అధిరోహించి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచాడు.

ప్రస్తుతం నేపాల్‌లోని 6,100 మీటర్ల ఎత్తు కలిగిన మౌంట్‌ కనామో పర్యతాన్ని అధిరోహించే అవకాశం అఖిల్‌కు వచ్చింది. ఆర్థికంగా అంత ఖర్చు భరించలేని అఖిల్‌ మౌంట్‌ కనామో పర్యతరోహణ లక్ష్యం సందేహాస్పదంగా మారింది. కఠినమైన పర్యతారోహణను సాహసంతో ముందుకు వెళ్తేనే లక్ష్యాన్ని చేరువవుతుంది. అయితే అఖిల్‌కు సాహసం, శారీరక దారుఢ్యం ఉన్నా ఆర్థిక వనరుల లోటు అడ్డంకిగా మారింది. మౌంట్‌ కనామో పర్యతారోహణకుగాను నేపాల్‌కు ఆగస్టు 4న వెళ్లాల్సి ఉంది. పర్యతారోహణకు సంబంధించిన ప్రక్రియ ఆగస్టు 9న మొదలవుతుంది. దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే తెలంగాణ రాష్ట్రం పూర్వ వరంగల్‌ జిల్లా నుంచి 6,100 మీటర్ల ఎత్తు ఉన్న పర్యతాన్ని అధిరోహించిన రికార్డు సాధించే అవకాశం ఉంది. అఖిల్‌కు ఆర్థిక సాయం చేయదలచిన వారు 9963925844 నంబర్‌లో సంప్రదించవచ్చు.  

మరిన్ని వార్తలు