దేశాభివృద్ధిలో యువత కీలకం

17 Mar, 2018 09:02 IST|Sakshi
పరిపూర్ణానందస్వామితో నైనా జైస్వాల్, అగస్త్యజైస్వాల్‌ మాట్లాడుతున్న అకున్‌ సబర్వాల్‌

మత్తు పదార్థా లకుఅలవాటుపడొద్దు

ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో డ్రగ్స్‌ వాడకం బాధాకరం  

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌

సాంకేతిక విద్యశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌

ఇబ్రహీంపట్నంరూరల్‌: యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ పేర్కొన్నారు. యువత చెడు ధోరణులకు అలవాటు పడుతున్నారని, మత్తుపదార్థాల జోలికి వెళ్లి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామ సమీపంలోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సిన్సియా– 2కె18 పేరుతో సాంకేతిక సంబరాలు జరిగాయి. రెండో రోజు ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల చేత ముఖాముఖి, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అకున్‌సబర్వాల్‌ మాట్లాడుతూ ఇంటర్నేషనల్‌ స్కూళ్లల్లో విద్యా ర్థులు డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను పా డు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ను పట్టుకుని 21 మందిని అరెస్టు చేసి 12 కేసు లు నమోదు చేశామని చెప్పారు.  రాష్ట్ర ప్రభు త్వం డ్రగ్స్‌ విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. మీడియా, సెల్‌ఫోన్‌ల ప్రభావం వల్ల యువత చెడు అలవాట్లకు లోనవుతున్నా రని చెప్పారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. అనంత రం విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన పలు ప్ర శ్నలకు అకున్‌సబర్వాల్‌ సమాధానం ఇచ్చారు. 

చదువే అన్నింటికీ సమాధానం  
కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామీజీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్య అంటే సమాధానం, పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, వారిని జీవితకాలం చూసుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను గుర్తుంచుకోవాలని సూచించారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి అందరం కలిసి కృషిచేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరినీ విద్యావంతులను చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో  300 గ్రామాలను దత్తత తీసుకొని అందులో వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని వెల్లడించారు. 

ఆకట్టుకున్న అక్కాతమ్ముళ్ల ప్రసంగం
పదిహేడేళ్ల అతి చిన్న వయసులోనే పీహెచ్‌డీ ప్రవేశం పొందిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిని నైనా జైస్వాల్, 9 సంవత్సరాల ప్రాయంలోనే పదో తరగతి పూర్తి చేసిన అగస్త్య జైస్వాల్‌లు విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. తల్లిదండ్రుల తో పాటు గురువుల ప్రోత్సాహం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో చక్కగా మాట్లాడి అబ్బుర పరిచారు. చదువుల్లో, ఆటల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ రాఘవ చిరబుడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ నయనతార, వైస్‌ ప్రిన్సిపల్‌ రామశాస్త్రీ, జేఎన్‌టీయూ రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ కిషన్‌లాల్, కళాశాల సీనియర్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి విజయ మేరీ, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

చదువులు సమాజానికి ఉపయోగపడాలి
ఇబ్రహీంపట్నంరూరల్‌: మనం చదివిన చదువులు సమాజం కోసం ఉపయోగపడాలని సాంకేతిక విద్యశాఖ కమిషనర్‌  నవీన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి గ్రామ సమీపంలో గల సీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో గత రెండు రోజులుగా సిన్సియా 2కె18 పేరుతో సాంకేతిక సంబరాలు జరిగాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా  నవీన్‌ మిట్టల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికరంగంలో విద్యార్థులు పురోగతి సాధించాలన్నారు. ప్రస్తుతం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణ కనుగొనాలన్నారు. కృషి, పట్టుదలతో విద్యనభ్యసిస్తే అనుకున్నది సాధించడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం నవీన్‌మిట్టల్‌ను కళాశాల చైర్మన్‌ రాఘవ చీరబుడ్డీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నయనతార, సీనియర్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి విజయమేరీలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు