జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శనం

11 Feb, 2019 02:54 IST|Sakshi

సహస్ర ఘటాలతో అమ్మవారికి భక్తుల అభిషేకాలు

జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌): అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగుళాంబ అమ్మవారు వసంత పంచమిని పురస్కరించుకుని ఆదివారం నిజరూప దర్శనమిచ్చారు. ఆలయంలో సహస్ర ఘటాలకు పూజలు చేసిన భక్తులు వాటిని శిరస్సున ధరించి అమ్మవారిని అభిషేకించారు. వందమందికి పైగా కాళాకారులు వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలతో అమ్మవారి నమూనా విగ్రహాన్ని ఊరేగిస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహిళా భక్తులు ఏకరూప వస్త్రధారణతో కలశాలు శిరస్సున ధరించి భక్తిని చాటుకున్నారు. 5 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో చండీ హోమాలకు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి మూల విరాట్‌ను పంచామతాలతో అభిషేకించారు. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ మంత్రి డీకే.అరుణ, సికింద్రాబాద్‌ కోర్టు జడ్జి సునీత, అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఏ.రాధిక తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు