మహా కిక్కు

24 Apr, 2014 01:39 IST|Sakshi

 ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఎన్నికల వేళ మద్యం విక్రయాలపై అధికారులు నియంత్రణ విధించడంతో అక్రమార్కులు మహారాష్ట్ర నుంచి మద్యం దిగుమతి చేసుకుంటున్నారు. సరిహద్దు గ్రామాల్లో దాచి రాత్రి వేళ బెల్టుషాపులకు తరలిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చినా బెల్టు దుకాణాల్లో మాత్రం దేశీదారు ఏరులై పారుతోంది. అధికారులు ఎంత కట్టడి చేసినా అక్రమ మద్యం రవాణా ఆగడం లేదని ఇప్పటివరకు పట్టుబడ్డ మద్యాన్ని బట్టి తేటతెల్లమవుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై 496 కేసులు నమోదు చేయగా రూ.24.54లక్షల మద్యం పట్టుబడింది. ఇందులో అధికంగా మహారాష్ట్ర నుంచి మద్యం తరలిస్తున్న కేసులే ఉండడం గమనార్హం.

 దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు
 గతేడాది ఇదే నెలలో మద్యం అమ్మకాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ మొత్తంలోనే దుకాణాలకు మద్యం పంపిణీ చేసింది. ఎన్నికల వేళ కావడంతో మద్యం కొరత తీవ్రంగా ఏర్పడింది. మద్యం దుకాణాదారులు వచ్చిన స్టాకును బెల్టు దుకాణాలకు తరలించి దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ఉన్న కొద్ది మద్యాన్ని అమ్ముతుండగా ఈ మద్యం కోసం మందుబాబులు ఉదయాన్నే బారులు తీరుతున్నారు. దొరికిన మద్యాన్ని కూడా మద్యం వ్యాపారులు అధిక ధ రలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

 మహారా ష్ట్ర నుంచి మద్యం అక్రమంగా దిగుమతి చేస్తూ గ్రామా ల్లో నిల్వ చేస్తున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముం దు జిల్లా అంతట డంప్ చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. మన జిల్లాలోని సరిహద్దు గ్రామాలకు లింక్‌రోడ్ల ద్వారా మహారాష్ట్ర నుంచి మద్యం దిగుమతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం లెసైన్సుల గడువు చివరికి రావడం, ఇప్పటికే టార్గెట్ పూర్తి చేసుకున్న మద్యం వ్యాపారులు అక్రమాలకు తెర లేపుతున్నట్లు తెలుస్తోంది.

 బ్లాక్ దందా
 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొందరు మద్యం వ్యా పారులు కొత్త దందాకు తెరలేపారు. స్టాక్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. తెరవెనుక బ్లాక్ దందాను గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకొ ని వ్యాపారులు అసలు ధరకన్నా అధిక మొత్తానికి మ ద్యం బాటిళ్లను బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే కొందరు మద్యం వ్యాపారులు మద్యం లేదంటూ దుకాణాలు మూసివేస్తున్నారు.

మరో వైపు రా జకీయ నాయకుల ప్రచార కార్యక్రమాల్లో తిరిగే వారు మాత్రం పుష్కలంగా మందుతో విందు చేసుకుంటున్నా రు. ఇదేలా సాధ్యమంటే.. వచ్చిన మద్యం స్టాక్ రాజకీ య నాయకుల రహస్య ప్రదేశాలకు తరులుతోంది. దీం తో దుకాణాల ఎదు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నా యి. మరోవైపు దుకాణదారులు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. మద్యం కావాలని ఎవరైన వస్తే మద్యం లేదని చె బుతున్నారు. ధర ఎంతైన చెల్లిస్తాం.. కచ్చితంగా మ ద్యం కావాలంటే మాత్రం ఎంఆర్‌పీ ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నాయకుల నుంచి ముందస్తు అర్డర్‌లను తీసుకుంటూ మద్యాన్ని వాహనాల్లో చేరవేస్తున్నట్లు సమాచారం. ఎంఆర్‌పీ ధరకంటే 30 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్షల్లో అక్రమ దందా సాగుతోంది.

 ఆ రెండు రోజుల కోసం భారీగా నిల్వలు
 ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల పోలింగ్ రోజుకంటే 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఈనెల 30న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం దిగుమతికి వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి రెండు రోజులు ఓటర్లకు పెద్ద మొత్తంలో మద్యం పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ రెండు రోజుల కోసమే భారీగా మద్యం నిల్వలు ఉంచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం మొత్తం మద్యం పంపిణీ ఒక ఎత్తై పోలింగ్‌కు ముందు రెండు రోజుల మద్యం పంపిణీ మరో ఎత్తు.

చాలా మంది అభ్యర్థులు ప్రచారం కంటే ఎన్నికల ముందు రోజే ఎక్కువగా మద్యం పంపిణీ చేస్తుంటారు. గ్రామాల్లో రాత్రికి రాత్రే ఇంటికొక మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తుంటారు. ఉదయం వరకే స్టాక్‌ను సరఫరా చేసేస్తారు. ఎన్నికల్లో ఈ ప్రభావం చాలా మట్టుకు కనిపిస్తోంది. ఏదేమైన మద్యం ఏరులై పారించడమే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహరచన చేస్తుండడంతో అధికారులు దాన్ని ఏమాత్రం అడ్డుకుంటారనేది చూడాల్సిందే.

మరిన్ని వార్తలు