అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి

26 Mar, 2018 09:45 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి దుర్గాశంకర్‌మిశ్రా

భూపాలపల్లి అర్బన్‌ : నీతి ఆయోగ్‌తో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌మిశ్రా అన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా దుర్గాశంకర్‌మిశ్రా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు, మిషన్‌ భగీర«థ పనులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం, డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మా ణం, కేసీఆర్‌ కిట్ల పథకం అమలు తీరు బాగుందని తెలిపారు. అలాగే టూరిజం అభివృద్ధి పనులు చకచక సాగుతున్నాయని, జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా జంతు సంపద అధికంగా లేదన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఇతర జంతువులు పెంపకాన్ని అధికారులు ప్రోత్సహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో మాట్లాడి కర్ణాటక రాష్ట్రం తరహాలో ఎకో టూరి జానికి ప్రత్యేక అధికారులను నియమించేలా చూస్తామని తెలిపారు. మరో 8 నెలల్లో జిల్లా సందర్శనకు వస్తానని, అప్పటి లోపు అభివృద్ధి చేసి చూపించాలన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ రవికిరణ్, డీఆర్వో మోహ న్‌లాల్, జిల్లా అధికారులు అనురాధ, డాక్టర్‌ అప్పయ్య, అక్బర్, రాజారావు, భూపాలపల్లి మునిసిపల్‌ కమిషనర్‌ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు