ఈఎన్‌టీ పరీక్షలకు కసరత్తు 

13 Jan, 2019 10:32 IST|Sakshi

నల్లగొండ టౌన్‌ : జిల్లాలో ఒకవైపు కంటివెలుగు వైద్యశిబిరాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.. ఫిబ్రవరి మాసంలో ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతుతోపాటు డెంటల్‌ ) పరీక్షలను నిర్వహించడానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో గత ఆగస్టు 15న ప్రారంభమైన కంటివెలుగు శిబిరాలను ఈ నెల 26 వరకు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కొంత ఆలస్యమయ్యే అవకాశం కని సిస్తోంది. ఆ శిబిరాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఈఎన్‌టీ పరీక్షల శిబిరాలను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించడానికి అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌నుంచి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాల స భ్యులందరి ఆరోగ్య వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఈ మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన శిక్షణను ఏఎన్‌ఎంలకు పూర్తి చేశారు. ఏఎన్‌ఎంల వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్‌ల్లోకి 2014 సమగ్ర కుటంబ సర్వే లెక్కల ప్రకారం కుటుంబాల ఆరోగ్య వివరాలు ఎస్‌కెఎస్‌ నుంచి డౌన్‌లోడ్‌ ఆయ్యా యి. దీనిలో ఆయా కుటుంబ యజమాని ఆధార్‌ నంబర్‌ను నమోదు చేస్తే ఆ కుటుంబ సభ్యుల వివరా లు, ఆరోగ్య స్థితిగుతులు తెలిసిపోనున్నాయి. వాటి ఆధారంగా వారి వద్దకు వెళ్లి సభ్యుల ఆరోగ్య స్థితిగతులను ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ కుటుంబంలోని సభ్యులు మరణిస్తే వారి పేరును తొలగించడం, కొత్త సభ్యులు వస్తే నమోదు చేయడం వంటి సదుపాయం కూడా కల్పించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ గంగవరప్రసాద్‌ ఈ నెల 16వ తేదీలోగా హెల్త్‌ ప్రొఫైల్‌ను పూర్తి చేసి తమకు అందజేయాలని ఆయా వైద్యాధికారులకు, డిప్యూటి డీఎంహెచ్‌ఓలకు, ఏఎన్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏఎన్‌ఎంలు హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.  జిల్లా వ్యాప్తంగా సేకరించిన అన్ని కుటుంబాల హెల్త్‌ ప్రొఫైల్‌ను రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపించనున్నారు. తదనంతరం అక్కడినుంచి ఇచ్చే గైడ్‌లైన్స్‌ మేరకు ఫిబ్రవరిలో ఈఎన్‌టీ పరీక్షల క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. శిబిరాల కోసం అవసరమైన ఈఎన్‌టీ డాక్టర్లు, ఆడియాలజిస్టులు, డెంటల్‌ డాక్టర్ల నియామకంతో పాటు పరీక్షలకు కావాల్సిన పరికరాలను రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.   

ఆదేశాలు రాగానే ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈఎన్‌టీ పరీక్షలు నిర్వహించడానికి ఏ ర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పటికే ఆ యా కుటుంబ సభ్యుల హెల్త్‌ ఫ్రొఫైల్‌ను అన్ని పట్టణాలు, గ్రామాలలో సి బ్బంది సేకరిస్తున్నారు. హెల్త్‌ ప్రొఫైల్‌ ఆ  ధారంగా కమిషనర్‌ ఇచ్చే గైడ్‌లైన్స్‌ ప్రకా రం శిబిరాలను ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్‌ గంగవరప్రసాద్, డీఎంహెచ్‌ఒ

మరిన్ని వార్తలు