అర్హులైన క్రైస్తవులకు గిఫ్ట్‌లు అందేలా చర్యలు

1 Dec, 2019 05:58 IST|Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

విజయనగర్‌ కాలనీ: క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని అర్హులైన క్రిస్టియన్‌ సోదరులకు గిఫ్ట్‌ ప్యాక్‌లు అందేలా శాసన సభ్యులు, కార్పొ రేటర్లు తగు చర్యలు తీసుకోవాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో హోంమం త్రితో కలసి క్రిస్మస్‌ వేడుకల నిర్వహణపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే 9 వేల మంది క్రైస్తవులకు ఎల్‌బీ స్టేడియంలో విందు నిర్వహిస్తామన్నారు.

ఈ విందుకు సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతార న్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 200 ప్రాం తాల్లో పేద క్రైస్తవులకు గిఫ్ట్‌ ప్యాక్‌లు అందిస్తున్నామన్నారు. ఒక్కో ప్రాంతంలో 500 గిఫ్ట్‌ ప్యాక్‌లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రిస్మస్‌ విందు నిర్వహణకు ఎంపిక చేసిన చర్చిలకు రూ.లక్ష చొప్పున చర్చి బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారులు ఏకే. ఖాన్, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు