జనవరి 1నుంచి నుమాయిష్‌: ఈటల

30 Dec, 2019 03:18 IST|Sakshi

గన్‌ఫౌండ్రీ: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. ఈ మేరకు నుమాయిష్‌ వివరాలను మంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ ఆదివారం మీడియాకు వెల్లడించారు. జనవరి 1 నుంచి 46 రోజులపాటు జరిగే 80వ నుమాయిష్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి బి.ప్రభాశంకర్, ఉపాధ్యక్షుడు ఎన్‌.సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు