ముందస్తు హోరు!

27 Sep, 2018 07:49 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ముందస్తు ఎన్నికల ప్రచారహోరు జోరందుకుంది. అక్టోబర్‌ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న ప్రచారంతో రాజకీయ పార్టీల ప్రచారపర్వం ఉధృతమవుతోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటించడం... మరో వైపు కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉండడం తో రెండు పార్టీల నేతలు ప్రచారం ము మ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాలో మంత్రు లు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ తరఫున ప్రచార కమిటీ కోకన్వీనర్‌ డీకే.అరుణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేత చిన్నారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ప్రచారపర్వంలో భాగంగా రాష్ట్ర స్థాయి ముఖ్యనేతల పర్యటనల జోరు కూడా పెరిగింది. ఇక నుంచి టీఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రతీ వారం రాష్ట్రస్థాయి నేతల పర్యటనలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. అలాగే అక్టోబర్‌ 5న సీఎం కేసీఆర్‌ వనపర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఇప్పటికే ప్రకటించారు. అదే విధంగా టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నాయి. ఇలా మొత్తం మీద ఎన్నికల జోష్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

స్పీడ్‌ అందుకున్న కారు 
అసెంబ్లీ రద్దు అనంతరం అభ్యర్థుల ప్రకటనతో దూకుడు మీదున్న టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో... అసమ్మతివర్గం తో సంబంధం లేకుండా బరిలో నిలిచే నేతలు తమ పనికానిచ్చేస్తున్నారు. ఈ సారి ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అందుకోసం జిల్లాకు చెందిన మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించింది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మం త్రి లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు.

దీంతో మంత్రి లక్ష్మారెడ్డి షాద్‌నగర్‌ మొదలుకుని జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాలలో పరిస్థితిని అంచనా వేస్తూ అవసరమైన చోట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందు లో భాగం గా కాస్త ఇబ్బందికరంగా ఉన్న షాద్‌నగర్, మక్తల్, కొడంగల్‌ నియోజకవర్గాల్లో విసృ ్తతంగా పర్యటిస్తున్నారు. అలాగే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధి లోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల నియోజకవర్గాలను మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో సమస్యలు ఎదురవుతున్న కల్వకుర్తి, గద్వాల నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. అలాగే ప్రచారంలో మరింత ఊపు తీసుకొచ్చేందుకు పార్టీలో కీలకమైన నేత, మంత్రి కేటీఆర్‌ గురువారం నాగర్‌కర్నూల్‌ బహిరంగసభలో పాల్గొననున్నారు. అదే విధంగా వచ్చే వారం అక్టోబర్‌ 5న సీఎం కేసీఆర్‌ వనపర్తి సభలో పాల్గొంటారు.ననున్నారు.
 
కదం తొక్కుతున్న కాంగ్రెస్‌ 
పాలమూరు ప్రాంతంలో గట్టి పట్టు ఉన్న కాంగ్రెస్‌ సైతం దూకుడు పెంచింది. అభ్యర్థులను ప్రకటించకపోయినా... బరిలో ని లిచే నేతల విషయంలో స్పష్టత ఉండడం తో ప్రచారపర్వంలో మునిగిపోయా రు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కాంగ్రెస్‌ నేతలు డీకే.అరుణ, చిన్నారెడ్డి, రేవంత్‌ జిల్లా వాసులే కావడంతో పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. ఇప్పటికే గద్వాలలో ముమ్మర ప్రచారం చేస్తున్న డీకే అరుణ... తనకు పట్టు ఉన్న నారా యణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో కూ డా పర్యటిస్తున్నారు. అదే విధంగా మాట ల వాగ్దాటితో టీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే రేవంత్‌రెడ్డి సైతం జడ్చ ర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి నియో జకవర్గాలలో వీలుచిక్కినప్పుడల్లా పర్యటిస్తున్నారు. ఆ యన ప్రాతినిధ్యం వహి స్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో గురువారం నుంచి ప్ర చారపర్వాన్ని ప్రారంభించనున్నారు. అ లాగే అక్టోబర్‌ 2 లేదా 3న అచ్చంపేటలో వంశీకృష్ణ, కొల్లాపూర్‌లో బీ రం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగసభలు నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అందరినీ కలుపుకుంటూ... 
మహాకూటమిలో భాగం కానున్న టీడీపీ, తెలంగాణ జన సమితి పార్టీలు ఇటీవలి కాలంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగంగా సీట్లు సాధించేందుకు ఆయా పార్టీల నేతలు నియోజకవర్గాల్లో ముమ్మర పర్యటనలు చేస్తున్నారు. మహాకూటమి ద్వారా పోటీ చేయాల్సి వస్తే అందరినీ కలుపుపోయేలా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ సీటు కోసం టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టీజేఎస్‌ తరఫున ఎస్‌.రాజేందర్‌రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా మక్తల్‌ తరఫున కూటమిలో భాగంగా సీటు ఖాయమనే భావనతో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. అలాగే పొత్తులో మూడో సీటు లో భాగంగా దేవరకద్ర కూడా దక్కితే టీడీపీ తరఫున తన భార్య సీతమ్మను బరిలో నిలపాలని దయాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ వనపర్తి మాజీ ఎమ్మె ల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి అవకాశం ఇవ్వొద్దనే పట్టుదలతో దయాకర్‌రెడ్డి ఉన్న ట్లు తెలుస్తోంది. అందుకే నియోజకవర్గ కేంద్రం దేవరకద్రతో పాటు అన్ని మండ ల కేంద్రాల్లో కూడా పార్టీశ్రేణులతో సభ లు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు