విద్యారంగ సమస్యలపై నేడు అఖిలపక్ష సమావేశం

21 Dec, 2017 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ గుర్తింపు పొందిన కేజీ టు పీజీ విద్యా సంస్థల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 21న మధాహ్నం 1.30కు అఖిలపక్ష నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల జేఏసీ నేతలు రమణా రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, సతీశ్‌ తెలిపారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. 17 వేల విద్యా సంస్థల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వ తీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. జూనియర్, డిగ్రీ కాలేజీల ట్యూషన్‌ ఫీజు పెంపు, ఫీజు రీయింబర్స్‌ మెంట్, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత ఆరోగ్య కార్డులు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు.  

>
మరిన్ని వార్తలు