గోదావరిఖని: కార్మికులంతా టీఆర్‌ఎస్‌ వైపే.. 

3 Dec, 2018 15:47 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  సోమారపు సత్యనారాయణ 

సాక్షి, గోదావరిఖని: సింగరేణి కార్మికులంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని రామగుండంలో వార్‌ వన్‌ సైడ్‌ అవుతుందని పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక టీబీజీకేఎస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు, నాయకుల కృషి ఫలితంగా రామగుండంలో ఎలక్షన్స్‌ వన్‌ సైడ్‌ అవుతుందని మిగతా పార్టీలకు డిపాజిట్లు రావన్నారు. జీతాలు పెంచమని పోయిన ఉద్యోగులను గుర్రాలతో తొక్కి, కరెంట్‌ ఇవ్వమని అడిగిన రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, తెలంగాణ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఇవ్వనని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వారసులు ఇక్కడకి రాబోతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసీఆర్‌ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.  20 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించానని తెలిపారు. టీబీజీకేఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, నూనె కొమురయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, దేవ వెంకటేశం, కనంక శ్యాంసన్, ఎట్టం కృష్ణ, ఆరెల్లి పోషం, వడ్డేపల్లి శంకర్, నాయిని మల్లేష్, కృష్ణమూర్తి, పుట్ట రమేశ్‌ పాల్గొన్నారు.


రామగుండం: ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతర్గాం మండల పరిధిలోని లింగాపూర్‌ గ్రామంలో  సోమారపు ఎడ్లబండితో రోడ్‌షో నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే సంక్షేమ పథకాల కొనసాగుతాయన్నారు.

>
మరిన్ని వార్తలు