‘అమెజాన్’లో తెలంగాణ హస్తకళలు

5 Feb, 2015 05:57 IST|Sakshi
‘అమెజాన్’లో తెలంగాణ హస్తకళలు
  • మంత్రి కేటీఆర్‌తో ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ ప్రతినిధుల భేటీ
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అం దిస్తామని ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ డాట్‌కామ్ పేర్కొంది. ఆన్‌లైన్ వ్యాపారంతో తెలంగాణ హస్తకళలను ప్రోత్సహించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణపై చర్చిం చేందుకు అమెజాన్ రియల్ ఎస్టేట్స్ అధిపతి జాన్ షాట్లెర్ ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధుల బృందం బుధవారం సచివాయలంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది.

    ఈ సందర్భంగా తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలను అమెజాన్ బృందం వెల్లడించింది. రిటైల్ వ్యాపారంలో భాగంగా త్వరలోనే రాష్ర్టంలో భారీ గిడ్డంగిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక గ్రూపులు తయారు చేసిన ఉత్పత్తులు, నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, బిద్రీ ఉత్పత్తులు తదితర తెలంగాణ హస్త కళలను మార్కెటింగ్ చేయడానికి అంగీకరించింది.

మరిన్ని వార్తలు