అంబేద్కర్ గురువునే అవమానిస్తారా!

15 Apr, 2015 03:08 IST|Sakshi

- పూలే విగ్రహాన్ని తొలగించి టాయిలెట్‌లో పడేస్తారా
- మహాత్ముడికిచ్చే గౌరవం ఇదేనా?
- అంబేద్కర్ జయంతిలో మండిపడిన దళిత సంఘాలు
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

 ఇందూరు: ‘‘అంబేద్కర్ తనకు గురువుగా చెప్పుకున్నమహాత్మా జ్యోతిరావు పూలేవిగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించి టాయిలెట్లలో పడేస్తారా! ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేకుండా స్థాపిస్తున్నా, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే విగ్రహానికి మా త్రం నిబంధనలు అడ్డొస్తున్నాయా? ఇదేనా మహా త్ములకు మనం ఇచ్చే గౌరవం... ఇలాంటప్పుడు ఈ సమావేశాలెందుకు...వారి గురించి గొప్పలు చెప్ప డం ఎందుకు?’’ అంటూ దళిత సంఘాలు అంబేద్క ర్ జయంతి కార్యక్రమంలో మండిపడ్డాయి.

పూలే వి గ్రహాన్ని తొలగించడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డి మాండ్ చేశాయి. పూలే విగ్రహాన్ని వెంటనే యథా స్థానంలో నిలపకపోతే ఉద్యమ బాట పడుతామని హెచ్చరించారుు. ఈ విషయంలో బీసీ సంఘం నేత లక్ష్మీనారాయణ చాల ఉద్వేగంగా ప్రసంగించారు. ఆ యన కంట తడిపెట్టి, అందరినీ కంటతడి పెట్టిం   చారు. దళిత నాయకుతు బంగారు సాయిలు, చిన్న  య్య పూలేకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖం డించారు.

ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఉం డి కూడా పూలే విగ్రహ స్థాపనకు పది అడుగుల స్థలాన్ని కేటాయించకపోవడం శోచనీయమన్నారు. కుల సంఘాలు విగ్రహాన్ని స్ధాపిస్తే, దానిని తీసుకెళ్లి టాయిటెట్లలో పడేయడం అతి దారుణమని పేర్కొన్నారు. జిల్లా పరువు పోయేలా వ్యవహరించారని, ఈ పాపం ఊరికే పోదదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వేదికపై
ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు కొంతసేపు మౌనంగా ఉండిపోయూరు. అనంతరం జుక్కల్ ఎ మ్మెల్యే హన్మంత్ సింధే మాట్లాడుతూ పూలే విగ్రహానికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, తిరిగి విగ్రహ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ బీబీ పాటిల్, జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు కూడా జరిగిన సంఘటను తీవ్రంగా ఖడించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పూలే విగ్రహం తొలగింపు సరికాదన్నారు.

టాయిలెట్లలో విగ్రహాన్ని పడేయడంలాంటి సంఘటన జిల్లాలో జరగడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రక టిం  చారు. అసలు విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు అడ్డొస్తున్నాయో కుల సంఘాల ఆధ్వర్వంలో కూర్చుండి సామరస్యంగా మాట్లాడుకుని సమస్యను పరి ష్కరించుకుందామని సూచించారు. విగ్రహ ఏర్పాటుకు తానే స్వయంగా పూనుకుంటానని హామి ఇచ్చారు.
 
 విగ్రహాన్ని తిరిగి నెలకొల్పండి

-కాంగ్రెస్ నేత డీఎస్

నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలో తొలగిం చిన జ్యోతిబా పూలే విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని మండలి విపక్ష మాజీ నేత డి. శ్రీని వాస్ కోరారు. పూలే విగ్రహం తొలగింపుపై ఆ   యన మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రొనాల్డ్ రోస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మహా   నీయుడైన పూలే విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా అన్ని వర్గాలు కలిసి ఏర్పాటు చే  సుకున్నాయని, అనుమతులు లేవన్న కారణం  తో దానిని తొలగించి స్టేషన్‌లో ఉంచటం సరి కాదన్నారు. ఈ సంఘటన బీసీ వర్గాలకు బాధ కలిగించిందన్నారు. తొలగించిన విగ్రహాన్ని తి రిగి రెండు రోజులలో ఏర్పాటు చేయాలని కో రారు. రెండు రోజులలో సమస్యను పరిష్కరి స్తానని కలెక్టర్ డీఎస్‌కు తెలిపారు.
 

మరిన్ని వార్తలు