మరో రెండు విమానాల్లో బయల్దేరిన అమెరికన్లు

13 Apr, 2020 04:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన అమెరికన్లు మరో రెండు విమానాల్లో ఆదివారం బయల్దేరారు. తెలంగాణ ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్‌ సమన్వయంతో వీరిని ఆ దేశానికి పంపారు. మధ్యాహ్నం 3.15కి మొదటి విమానం ఏఐ1615లో 81 మంది పెద్దలు, ఒక శిశువు ముంబైకి బయల్దే రారు. మరో విమానం ఏఐ 1617లో 82 మంది పెద్దలు,  ఒక శిశు వుతో 3.51కి ముంబైకి బయల్దేరింది. పూర్తి శానిటైజర్‌ చేసిన టెర్మినల్‌ ద్వారా థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి వీరిని పంపా రు. ఈ విమానాలు ముంబై మీదుగా అమెరికా వెళ్లనున్నట్లు ఆర్‌జీఐఏ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ విమానాల్లో ఎక్కే ప్రయాణికులను ముందుగా హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో బస చేయించారు. అమెరికన్‌ ఎంబసీ ఆధీనంలోకి తీసుకున్న ఈ హోటల్‌లోనే అందరికీ కరోనా స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. ఈ విమానాల్లో వెళ్తున్న వారి ప్రయాణ చార్జీలను ఇంకా నిర్ధారించలేదు. నిర్ణయించిన చార్జీలను అమెరికా వెళ్లాక చె ల్లించాలంటూ ప్రయాణికుల నుంచి హామీపత్రం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు