‘మోడల్ కేంద్రాలుగా అంగన్‌వాడీలు’

19 Apr, 2016 14:45 IST|Sakshi

సంగారెడ్డి : అంగన్‌వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి మండలం చేర్యాల గ్రామంలో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ మోడల్ అంగన్‌వాడీ కేంద్రంలో 50 మంది పిల్లలకు బోధించేందుకు ఓ గది, బాలింతల కోసం ప్రత్యేక గది ఉంటుందన్నారు. అలాగే వంట గది ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ దశలవారీగా మోడల్‌గా తీర్చిదిద్దుతామని, ఇందుకు యనిసెఫ్ సహకారం తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు