అమ్మాపురం రాజా సోంభూపాల్‌ కన్నుమూత

19 Aug, 2019 08:22 IST|Sakshi

సాక్షి, కొత్తకోట : అమ్మాపురం సంస్థానాదీశులు, అమరచింత మాజీ ఎమ్మెల్యే రాజా సోంభూపాల్‌ ఆదివారం హైద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. అమ్మాపురం సంస్థానానికి రాణి భాగ్యలక్ష్మమ్మ సంస్థానాదీశులుగా కొనసాగిన అనంతరం అమ్మాపురం సంస్థానానికి రాజుగా ముక్కెర వంశానికి చెందిన రాజా సోంభూపాల్‌కు పట్టాభిషేకం చేపట్టారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం సంస్థానాలను విలీనం చేసే సమయంలో 1962, 1967 సంవత్సరాల్లో అమరచింత నియోజకవర్గానికి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అనంతరం 1979 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వీరారెడ్డిపై ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచిరాజకీయాలకు దూరంగా ఉన్నారు. కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేశారు. రాజసోంభూపాల్‌కు కుమారుడు రాంభూపాల్, కూతురు గౌరీదేవీ ఉన్నారు. నేడు స్వగ్రామమైన అమ్మాపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తనయుడు రాజాశ్రీరాంభూపాల్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా