క్యూలోనే ప్రాణాలు విడిచిన వృద్ధుడు

17 Mar, 2015 16:44 IST|Sakshi

హైదరాబాద్ : ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సాయం కోసం వృద్ధాప్యంలో నానా కష్టాలు పడాల్సిన దుస్థితి దాపురించింది చాలామంది వృద్ధులకు. రేషన్ కార్డున్నప్పటికీ  రేషన్ రాకపోయేసరికి ఉప్పల్ పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... సత్యన్నారాయణ (67), ఆయన భార్య సీతాదేవి 30 ఏళ్ల క్రితమే భీమవరం నుంచి వచ్చి అల్వాల్‌లో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ నెల రేషన్ తీసుకుందామని డీలర్ దగ్గరకు వెళితే... రేషన్ రాలేదని, జాబితాలో మీ పేరు లేదని చెప్పిన డీలర్..సత్యన్నారాయణను ఉప్పల్ పౌరసరఫరాల కార్యాలయానికి వెళ్లాలని సూచించాడు. దీంతో సత్యన్నారాయణ మంగళవారం ఉదయం ఉప్పల్‌కు వచ్చి కార్యాలయం వద్ద క్యూలో నిలుచున్నాడు. ఎండ తీవ్రత వల్లో, మరే కారణమో గానీ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచాడు సత్యన్నారాయణ. ఇది చూసి అక్కడున్న వారు చలించిపోయారు.
 

మరిన్ని వార్తలు