బయటపడ్డ పురాతన నాణేలు 

21 Apr, 2018 02:37 IST|Sakshi
పురాతన నాణేలు( ఫైల్‌ ఫోటో)

దహెగాం (సిర్పూర్‌) : ఓ పాత ఇంటిని కూల్చివేస్తుండగా పురాతన నాణేల కుండలు బయటపడ్డాయి. కుమురం భీం జిల్లా దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన జునగరి గంగ మ్మ ఇంటిని అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు వెల్ములే సురేశ్, రమేశ్‌ కొనుగోలు చేశారు. ఇల్లును కూల్చి కొత్తగా నిర్మించాలనుకున్నారు. ఈ క్రమంలో పాత ఇంటిని కూల్చివేస్తుండగా గోడలో ఉన్న పురాతన నాణేల కుండలు పగిలి బయటపడ్డాయి. రాగి, వెండి, ఇత్తడివి కలిపి మొత్తం 1365 నాణేలు లభ్యమయ్యాయి. వీటిపై 1862, 1885, 1899, 1907 సంవత్సరాలు ముద్రించి ఉన్నాయి. ఈ నాణేలపై బ్రిటిష్‌ చక్రవర్తి విక్టోరియా మహారాణి, చార్మినార్, హెడ్వట్‌ సెవెన్‌ పేర్లు ఉన్నాయి.  నాణేలను పెంచికల్‌పేట్‌ తహసీల్దార్‌ రియాజ్‌ అలీ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. ఇంకేమైనా నాణేలు లభించాయా? అనే అనుమానంతో పోలీసులు.. సురేశ్, రమేశ్‌ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు