ఏ క్షణాన్నైనా తెలంగాణకి పవర్‌ కట్‌

8 Jun, 2017 08:30 IST|Sakshi
ఏ క్షణాన్నైనా తెలంగాణకి పవర్‌ కట్‌
- బకాయిలు చెల్లించేదాకా విద్యుత్‌ ఆపాలని ఏపీ జెన్‌కో ఆదేశాలు
రూ.3,138 కోట్లు బకాయి పడ్డ తెలంగాణ డిస్కంలు
 
సాక్షి, అమరావతి: ఏ క్షణంలోనైనా తెలంగాణకు ఏపీ విద్యుత్‌ నిలిపివేసే వీలుంది. బకాయిలు చెల్లించే వరకూ విద్యుత్‌ ఆపాలంటూ సదరన్‌ రీజియన్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఆర్‌ఎల్‌ డీసీ), ఏపీ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఏపీఎల్‌డీసీ)కి బుధవారం ఏపీ జెన్‌కో ఎండీ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పరిగణలోనికి తీసుకుని గ్రిడ్‌ డిమాండ్‌ను బట్టి షెడ్యూ లింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తవ డానికి మరికొన్ని గంటలు పడుతుంది. మొత్తం మీద బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం తెలంగాణకు విద్యుత్‌ ను నిలిపివేసే వీలుందని అధికారులు వెల్లడించారు.

బకాయిలను చెల్లించకపోతే మే 31వ తేదీ నుంచి విద్యుత్‌ను ఆపేస్తామని తెలియజేస్తూ ఏపీ జెన్‌కో ఇప్పటికే తెలంగాణకు నోటీసులిచ్చింది. తెలంగాణ డిస్కంలు మొత్తంమీద సుమారు రూ.3,138 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేసింది. సింగరేణి కాలరీస్‌కు ఇవ్వాల్సిన మొత్తం కింద రూ.1,360 కోట్లను తెలంగాణ డిస్కంల నుంచి సర్దుబాటు చేస్తామని అధికారికంగా తెలిపినా సింగరేణి అందుకు అంగీకరించడం లేదని ఏపీ జెన్‌కో ఆ నోటీసులో వెల్లడించింది. బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేనని ఏపీ డిమాండ్‌ చేసినా తెలంగాణ స్పందించలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో  విద్యుత్‌ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం బొగ్గు ఆధారిత విద్యుత్‌ను రెండు రాష్ట్రాలు 46.11 శాతం (ఆంధ్రప్రదేశ్‌), 53.89 శాతం (తెలంగాణ) నిష్పత్తిలో వాడుకోవాల్సి ఉంది.

ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి రోజుకు 1,200 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణకు వెళ్తోంది. తెలంగాణ నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు ఏపీకి వస్తోంది. తెలంగాణకు అదనంగా రోజుకు సుమారు 400 మెగావాట్ల విద్యుత్తు ఏపీ జెన్‌కో నుంచి అందుతోంది. ఈ అద నపు విద్యుత్తుకు సంబంధించే తెలం గాణ డిస్కంలు సకాలంలో డబ్బు చెల్లిం చని కారణంగా బకాయి పడింది. ఇది లా ఉంటే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గింది. మరోవైపు తెలం గాణ విద్యుత్‌ నిలిపివే యడంతో మరి కొంత విద్యుత్‌ ఉత్పత్తి డిమాండ్‌ తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచు కుని ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లలో ఏమేర ఉత్పత్తి ఆపివేయాలనే దిశగా అధికా రులు తర్జన భర్జన పడుతున్నారు.
మరిన్ని వార్తలు