అంగన్‌వాడీలకు గోవాలో అత్యధిక వేతనం

29 Jul, 2017 02:16 IST|Sakshi
అంగన్‌వాడీలకు గోవాలో అత్యధిక వేతనం

ఎంపీ కవిత ప్రశ్నకు కేంద్ర మంత్రి మేనకా గాంధీ సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: అంగన్‌వాడీ వర్కర్లకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అదనపు గౌరవ వేతన వివరాలను కేంద్రం వెల్లడించింది. శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ సమాధానమిచ్చారు. కేంద్రం అంగన్‌వాడీ వర్కర్లకు రూ.3 వేలు, సహాయకులకు రూ.1,500 ఇస్తోందని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా గౌరవ వేతనం ఇస్తున్నాయని పేర్కొన్నారు. గోవా అత్యధికంగా అర్హత, సర్వీసును బట్టి రూ.3,062 నుంచి రూ.11,937 వరకు ఇస్తోందని చెప్పారు. హెల్పర్లకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు ఇస్తోందన్నారు. తమిళనాడు రెండోస్థానంలో నిలిచిందని, వర్కర్లకు రూ.6,750, హెల్పర్లకు రూ.4,275 ఇస్తోందని చెప్పారు. తదుపరి స్థానంలో తెలంగాణ నిలిచిందని, వర్కర్లకు రూ.4 వేలు ఇస్తుండగా, హెల్పర్లకు రూ.3 వేలు ఇస్తోందని వివరించారు.

మరిన్ని వార్తలు