‘రేయాన్స్‌’పై మంత్రుల ఆగ్రహం

3 Jan, 2018 03:47 IST|Sakshi

ఈనెల 9లోపు కార్మికులకు ఒకనెల జీతం చెల్లించాలి

యూనియన్ల జేఏసీ, కంపెనీ ప్రతినిధులతో సమావేశం

పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం, మంత్రులు నాయిని, చందూలాల్‌

సాక్షి, హైదరాబాద్‌: భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌ రేయాన్స్‌ ఫ్యాక్టరీలో (బిల్ట్‌– బల్లాపూర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌) పని చేస్తున్న కార్మికుల పట్ల కంపెనీ యాజ మాన్యం నిర్లక్ష్య ధోరణిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూ లాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడటంతో రోడ్డున పడిన దాదాపు 750 మంది కార్మికులకు ఈనెల 9వ తేదీలోపు సంక్రాంతి పండుగ కోసం ఒక నెల జీతం చెల్లించాలని కంపెనీ ప్రతినిధికి డెడ్‌లైన్‌ విధించారు. 10వ తేదీన సచివాలయంలో జరిగే సమావేశానికి కంపెనీ సీఈవో హాజరు కావాలని ఆదేశిం చారు. ఈ రెండింటిలో దేనిలో విఫలమైనా  తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫ్యాక్టరీ మూతపడి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలను తీర్చ డం లేదని రేయాన్స్‌ ఫ్యాక్టరీ యూనియన్ల జేఏసీ మంత్రులను ఆశ్రయించడంతో వారి ఆధ్వర్యంలో మంగళవారం సచివాల యంలో యూనియన్ల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో సంయుక్త సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ యాజమాన్య ధోరణిని మంత్రులకు యూనియన్‌ ప్రతినిధులు వివరించారు. 32 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వారి గోడు వెల్లడించారు. దీనిపై కడియం, నాయిని, చందూలాల్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడితే కార్మికులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్, కంపెనీ యాజమాన్యం అడిగిన ప్రతి డిమాండ్‌నూ అంగీకరిం చారన్నారు. త్వరలోనే కంపెనీ ప్రారం భిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటివరకు ఆ విషయం పట్టించు కోకపోవడం సీరియస్‌గా పరిగణిస్తున్నా మన్నారు. తీరు మార్చుకోకపోతే చట్టప రంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు ఏకకా లంలో చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో కార్మికశాఖ కమి షనర్‌ అహ్మద్‌ నదీమ్, జాయింట్‌ కమి షనర్‌ భాగ్యనాయక్, డిప్యూటీ కమిషనర్‌ రమేష్‌ బాబు, బిల్ట్‌ ఇండస్ట్రీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కేశవరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు