కొత్త ‘పోలీసులు’

22 Jul, 2018 02:29 IST|Sakshi

హైదరాబాద్‌ : పోలీస్‌ స్టేషన్‌లో విధులు ఎవరు నిర్వర్తిస్తారు..? పోలీసులే కదా అని తేలికగా అనేయకండి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఆ మాట మాత్రం మీరు చెప్పరు. ఎందుకంటే అక్కడ పోలీసులతో పాటు సీమకోళ్లు కూడా విధులు నిర్వర్తిస్తుంటాయి. అదేంటి సీమకోళ్లకు అక్కడేం పని అని ఆశ్చర్యపోకండి. అవి ఎవరికి కాపలా కాస్తున్నాయనే కదా మీ అనుమానం. బంజారాహిల్స్‌లో కమాండ్‌ కంట్రోల్‌ టవర్లు నిర్మిస్తున్న ప్రాంతంలోని జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లోని పురాతన క్వార్టర్స్‌లోకి మార్చారు.

అయితే ఇటీవల ఈ క్వార్టర్‌లోకి పాములొస్తున్నాయి. వారం కింద రెండు నాగుపాములు ట్రాఫిక్‌ సీఐ బల్వంతయ్య గదిలోనే తిష్టవేశాయి. వీటి బారి నుంచి రక్షించుకునేందుకు సీమకోళ్ల ఉపాయాన్ని అమలు చేశారు. సీమకోళ్లు ఉన్న ప్రాంతంలో పాములు తిరగవు. పాములను రానివ్వవు. శనివారం స్టేషన్‌ ఆవరణలోకి రెండు సీమకోళ్లను తీసుకొచ్చి వదిలేశారు. 

మరిన్ని వార్తలు