తమ పిల్లల విషయంలో ఇలా చేయగలరా?

20 Jul, 2020 08:33 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అనేక మంది పెంపుడు శునకాలను రోడ్లపై వదిలేస్తున్నారని, ఇది అమానవీయమైన చర్య అని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ఎవరైనా తమ పిల్లల విషయంలో ఇలా చేయగలరా? అంటూ ప్రశ్నించారు. తమను పెంచుకునే కుటుంబంపై ఆయా శునకాలు అన్ని విధాలా ఆధారపడి ఉంటాయని, వాటి విషయంలో అమానవీయంగా వ్యవహరించకూడదని సూచించారు. అలా చేయడం శునకాల పట్ల క్రూయల్‌గా వ్యవహరించడమేనని, ఇది చట్ట ప్రకారం నేరమని సీపీ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు