ఆకలి తీర్చిన అన్నపూర్ణ: కేటీఆర్‌ 

16 May, 2020 09:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా అయిదున్నర కోట్ల మంది ఆకలి తీర్చినట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఈ కేంద్రాల ద్వారా 65 లక్షల మందికి పైగా నాణ్యమైన ఉచిత భోజన సదుపాయం అందినట్లు వెల్లడించారు. పేదల ఆకలి తీర్చే ఇంత పెద్ద భారీ కార్యక్రమం మరే రాష్ట్రంలోనూ లేదంటూ, ఈ కార్యక్రమానికి భాగస్వామిగా ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. (మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత )

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదన్న సీఎం కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా అన్నపూర్ణ భోజన సదుపాయం కల్పిస్తుండటాన్ని, హైటెక్‌ కిచెన్‌లో అత్యంత పరిశుభ్రంగా భోజనం తయారీ, మొబైల్‌ క్యాంటీన్ల ద్వారా ఆహారం సరఫరా, అన్నపూర్ణ భోజన కేంద్రాలు తదితరమైన వాటితో రూపొదించిన వీడియోక్లిప్‌ను, నగరంలో గతంలో తాను అన్నపూర్ణ కేంద్రాలను సందర్శించినప్పటి కొన్ని ఫొటోలను కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. (సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను : కేటీఆర్‌)

మరిన్ని వార్తలు