తెలంగాణకు మరో 100 ఎంబీబీఎస్ సీట్లు

25 Apr, 2015 01:49 IST|Sakshi
తెలంగాణకు మరో 100 ఎంబీబీఎస్ సీట్లు

ఉస్మానియాకు 50, కాకతీయకు 50 సీట్లు
వసతులు పరిశీలించిన ఎంసీఐ బృందం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మరో 100 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. ఉస్మానియాకు 50, కాకతీయ మెడికల్ కాలేజీకి 50 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యవిద్యా సంచాలకుడు డా.పుట్టా శ్రీని వాస్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు భారతీయ వైద్య మండలికి చెందిన 2 బృందాలు ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలను సందర్శించినట్లు చెప్పారు. ఆయా మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, పరికరాలు, రోగుల సంఖ్య, ల్యాబ్ సౌకర్యాలను ఎంసీఐ బృందాలు పరిశీలించినట్లు పుట్టా శ్రీనివాస్ చెప్పారు. వారి పర్యటన సంతప్తికరంగా జరిగినట్లు, ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో 200, కాకతీయ మెడికల్ కాలేజీలో 150, రిమ్స్‌లో 100, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 100, గాంధీలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీల్లో పెంచే సీట్లతో కలిపి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 850 ఎంబీబీఎస్ సీట్లు అవుతాయి.

మరిన్ని వార్తలు