మరో ఎస్సైపై వేటు

13 Mar, 2017 04:00 IST|Sakshi
మరో ఎస్సైపై వేటు

పెద్దపల్లి ఎస్సైను హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేసిన సీపీ

సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా బొంపల్లిలో రాత్రి పూట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన దళిత దంపతులను దుర్భాషలాడుతూ, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదిన ఘటనలో మరో ఎస్సైపై వేటు పడింది. ఇప్పటికే ధర్మారం ఎస్సై హరిబాబును హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేసిన రామగుండం సీపీ విక్రంజిత్‌ దుగ్గల్‌ ఆదివారం పెద్దపల్లి ఎస్సై తడబోయిన శ్రీనివాస్‌నూ హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో పెద్దపల్లి తాత్కాలిక ఎస్సైగా మంచిర్యాల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న బానోతు వెంకన్నను నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.

‘ఖాకీ కావరం’పై విచారణ

ఖాకీ కావరం

అట్రాసిటీ కేసుపై విచారణ షురూ: దళిత దంపతులు అరికెల్ల శ్యామల, దేవేందర్‌పై కలెక్టర్‌ అళగు వర్షిణి సూచనలు.. బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో శ్యామల ఫిర్యాదు మేరకు ధర్మారం, పెద్దపల్లి ఎస్సైలు హరిబాబు, శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కేసుపై విచారణ జరిపేందుకు మంచిర్యాల ఏసీపీ సతీష్‌ను సీపీ దుగ్గల్‌ నియమించారు. ఇద్దరు ఎస్సై లపై నమోదైన కేసును నిష్పాక్షికంగా విచారణ జరిపేందుకుగా నూ పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్‌ను బాధ్యతలనుంచి తప్పిస్తున్నట్టు డీసీపీ విజేందర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు