తెలంగాణలో మరో ఆరు బెటాలియన్లు

19 Jan, 2015 03:19 IST|Sakshi
తెలంగాణలో మరో ఆరు బెటాలియన్లు
  • ప్రతిపాదనలు పంపామన్న అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది
  • హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు సైకిల్‌యాత్ర
  • డిచ్‌పల్లి/నిజామాబాద్: తెలంగాణలో ప్రస్తుతమున్న తొమ్మిది ప్రత్యేక పోలీస్ బెటాలియన్లకు తోడుగా మరో ఆరు కొత్త బెటాలియన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని టీఎస్‌ఎస్‌పీ అడిషనల్  డీజీపీ రాజీవ్ త్రివేది తెలిపారు. బెటాలియన్లలో రెండువేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు ఆయన తన ఇద్దరు కుమారులతో కలిసి సైకిల్‌యాత్రగా వచ్చారు.

    ఉదయం 4.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం నిజామాబాద్‌కు చేరుకున్నారు. వారికి నిజామాబాద్‌లో ఎస్పీ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజీవ్‌త్రివేది విలేకరులతో మాట్లాడుతూ ఐపీఎస్‌ల విభజనలో తనను తెలంగాణకు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది బెటాలియన్లకు ఇలాగే సైకిల్‌యాత్ర చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు