పదో తరగతి చదివే సమయంలో లొంగదీసుకుని..

26 Nov, 2014 02:40 IST|Sakshi
పదో తరగతి చదివే సమయంలో లొంగదీసుకుని..

చింతగట్టు(హసన్‌పర్తి) : ఓ విద్యార్థిని పదో తరగతి చదివే సమయంలో లొంగదీసుకున్నాడో ప్రబుద్ధుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విందులు, వినోదాలకు తీసుకెళ్లాడు. నాలుగేళ్లుగా వెంట తిరిగి.. చివరికి ఇప్పుడు తనకేమి సంబంధం లేదని ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రరుుంచింది. బాధితురాలి కథనం ప్రకారం.. చింతగట్టు శివారులోని సుభాష్ నగర్‌కు చెందిన మేకల అనూష, అదే ప్రాంతానికి చెందిన నద్దునూరి అనిల్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో అనిల్ హైదరాబాద్‌లో రెండేళ్లు పాస్టర్‌గా శిక్షణ పొందాడు. ఆ సమయంలోనూ తాను తరచూ హైదరాబాద్ వెళ్లేదానినని అనూష తెలిపింది. శిక్షణ పూర్తరుున తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు.. తీరా శిక్షణ పూర్తరుున తర్వాత పెళ్లి మాటెత్తితే దాట వేస్తూ వచ్చాడు. గత మూడు నెలలుగా ఫోన్ చేయడం మానేశాడు. మూడు రోజుల క్రితం ఫోన్ చేసి పెళ్లి గురించి అడగగా.. సమాధానం చెప్పకుండా సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని చెప్పింది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్లు వివరించింది. అరుుతే అతడిపై కేసు పెట్టొద్దని.. ఎలాగైనా పెళ్లి జరిపించేలా చూడాలని అనూష వేడుకుంటోంది.

కొలిక్కిరాని పంచారుుతీ
అనూష ఫిర్యాదుతో పోలీసులు ఇరువురిని పిలిచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాల పెద్దలు కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. నాలుగు గంటలపాటు ఇరువైపుల పెద్దల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయినా సమస్య కొలిక్కిరాలేదు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ దీక్షకు దిగింది. అతడి ఇంటి ముందు టెంట్ వేసి కూర్చోగా..  స్థానిక మహిళలు ఆమెకు అండగా నిలిచారు.

మరిన్ని వార్తలు