'రాహుల్ తెలంగాణ యాత్రలో ఏపీ నేతలు'

13 May, 2015 17:46 IST|Sakshi
'రాహుల్ తెలంగాణ యాత్రలో ఏపీ నేతలు'

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై నరేంద్ర మోదీ సర్కారు స్పందించకపోవడం దారుణమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బంగారు తెలంగాణ అవుతుందని టీఆర్ఎస్ నాయకులు ఎలా మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకే రాహుల్ గాంధీ భరోసా యాత్ర చేపట్టారని తెలిపారు. రాహుల్ పర్యటనలో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొంటారని చెప్పారు.

కాగా గురువారం సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. 15వ తేదీ ఉదయం నిర్మల్‌లోని మడియాల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం పొరటికల్‌లో ఆయన పర్యటన ముగియనుంది.

మరిన్ని వార్తలు