'సీమాంధ్రోళ్లు పోవాలే.. తెలంగాణోళ్లు రావాలే'

24 May, 2015 13:52 IST|Sakshi
'సీమాంధ్రోళ్లు పోవాలే.. తెలంగాణోళ్లు రావాలే'

హుస్నాబాద్ రూరల్: దేశంలోనే తెలంగాణ ఆర్టీసీనీ నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతామని టీఎంయూ వ్యవస్థాపక కార్యనిర్వాహక అధ్యక్షుడు, కార్మికశక్తి అవార్డు గ్రహీత థామస్‌రెడ్డి అన్నారు.  ఈ నెల 28లోగా సీమాంధ్ర ఆర్టీసీ ఉద్యోగులు అక్కడికి వెళ్లిపోవాలని, అక్కడ పనిచేసే తెలంగాణ ఉద్యోగులు ఇక్కడకు రావాల్సిందేనన్నారు.

శనివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని సీమాంధ్ర నేతలు కోరుతున్నారని, ఇక్కడి ఆస్తుల్లో అంగుళం కూడా ఇవ్వబోమని చెప్పారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్ విలువ ప్రకారం విభజించి వాటా ఇస్తామన్నారు.

ఆర్టీసీ బోర్డులో 17మంది సభ్యులకు ఇద్దరే తెలంగాణకు వాళ్లు ఇద్దరే ఉన్నారని, ఇందులో అత్యధికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించే బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు