పోషకాహార విలువలపై యాప్‌

30 Jun, 2018 01:22 IST|Sakshi
ఎన్‌ఐఎన్‌ రూపొందించిన న్యూట్రిఫై ఇండియా నౌ యాప్‌

‘న్యూట్రిఫై ఇండియా నౌ’ పేరుతో ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్‌ల సృష్టి

17 భాషల్లో అందుబాటులోకి వచ్చిన మొబైల్‌ యాప్‌

ఢిల్లీలో యాప్‌ను ఆవిష్కరించిన అధికారులు

హైదరాబాద్‌: జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంయుక్త ఆధ్వర్యంలో పోషకాహార విలువలపై ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ పేరుతో మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ కార్యదర్శి డాక్టర్‌ బలరామ్‌ భార్గవ శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ యాప్‌ ప్రతి ఒక్కరికి ఒక న్యూట్రి షన్‌ గైడ్‌లా పనిచేయనుంది. ఒక వ్యక్తి ఏ ఆహారాన్ని ఎంత తీసుకోవాలి. తీసుకున్న ఆహారంలో ఏయే మోతా దుల్లో పోషకాలు ఉంటాయనే విషయాలను దీని ద్వారా తెలుసుకుని, ఆయా పదార్థాలను తీసుకునే వీలుంటుం ది. పోషకాహార పదార్థాల పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ యాప్‌ అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే భారతీయులు సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాలు, వాటిలో కేలరీల శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ ఏయే మోతాదుల్లో ఉంటాయి, అవి మన శరీరానికి ఏయే మోతాదుల్లో అవసరమనే విషయాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

దేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్‌
ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆయా దేశాలు వారి ఆహా రపు అలవాట్లకు అనుగుణంగా ఇలాంటి న్యూట్రిషనల్‌ యాప్‌లను రూపొందించుకుని వినియోగిస్తున్నారు. అయితే భారతీయుల ఆహారపు అలవాట్లు, వారు తీసుకునే ఆహారంలో ఉండాల్సిన పోషకాల గురించి ఇప్పటి వరకు ఇలాంటి యాప్‌లు అందుబాటులో లేవు. దేశంలోనే తొలిసారిగా ఈ యాప్‌ను ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 14 భాషల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఈ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. 

ఈ యాప్‌లో....
ఈ యాప్‌లో నాకు కావాల్సిన పోషకాహా రాలు (మై న్యూట్రియెంట్స్‌ రిక్వైర్‌మెంట్స్‌) నా భోజనంలో పోషకాలు (న్యూట్రియెంట్స్‌ ఇన్‌ మై ఫుడ్‌), నా డైట్‌.. నా యాక్టివిటీ (మై డైట్‌ అండ్‌ యాక్టివిటీ), సెర్చ్‌ ఫుడ్‌ బై న్యూట్రిషన్, సెర్చ్‌ ఫుడ్‌ బై లాంగ్వేజ్‌ తదితర అంశాలు  ఉన్నాయి. అవస రమైన దానిపై క్లిక్‌ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.

యాప్‌ ఉపయోగాలు...
ఈ యాప్‌ వల్ల మనిషి తాను తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల గురించి సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏ వయసు వారికి ఎన్ని కిలో కేలరీల ఆహారం అవసరం, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఏ మేరకు పోషకాలు లభిస్తాయి అనే విషయాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫిలింనగర్‌లో దారుణం..

జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య

ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..

మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ మృతి

‘మున్సిపల్‌’లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు

బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయ సునామీనే..

‘టిక్‌టాక్‌’ ఓ మాయ ప్రపంచం

అంత డబ్బు మా దగ్గర్లేదు..

సందిగ్ధం వీడేనా? 

కిరోసిన్‌ కట్‌

గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి భౌతికకాయం

కమలంలో కోల్డ్‌వార్‌ 

మున్సిపల్‌ ఎన్నికలు జరిగేనా..?

వరంగల్‌లో దళారీ దందా

మెట్రో రూట్లో ఊడిపడుతున్న విడిభాగాలు..

‘నగర’ దరహాసం

పాతబస్తీ పరవశం

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గుబులు..

ఎఫ్‌ఎన్‌సీసీలో జిమ్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో కాస్ట్‌లీ బ్రాండ్లపై మక్కువ..

తెలంగాణ సంస్కృతి, ఎంతో ఇష్టం

మాజీ ఎంపీ వివేక్‌ పార్టీ మార్పుపై కొత్త ట్విస్ట్‌!

గ్యాస్‌ ఉంటే.. కిరోసిన్‌ కట్‌..!

మరింత కిక్కు..! 

ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్‌’ చెరగని ముద్ర 

జైపాల్‌రెడ్డి ఇక లేరు..

గోడపై గుడి చరిత్ర!

చెత్త‘శుద్ధి’లో భేష్‌ 

కృష్ణమ్మ వస్తోంది!

అంత డబ్బు మా దగ్గర్లేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’