అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి...

6 Apr, 2018 10:49 IST|Sakshi

సిరికొండ: మండలంలో ఖాళీగా ఉన్న మినీఅంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాపోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ఐదు మినీ అంగన్‌వాడీ టీచర్లు, 6 ఆయాపోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి ఈనెల13 వరకు ఆన్‌లైన్‌లో దర ఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పో స్టులన్నింటికి గిరిజనులుకు మాత్రమే కేటా యించామని, మండలంలోని నం.1 అంగన్‌వాడీ సెంటర్‌లోని ఆయా పోస్టు జనరల్‌ వా రికి కేటాయించామని ఆమె తెలిపారు. కనీస విద్యార్హత పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తారన్నారు. దరఖాస్తుతోపాటు ఆధార్‌కార్డు కూడా జతచేయాలని ఆమె సూచించారు. ఎవ రైనా అంగన్‌వాడీ పోస్టును ఇప్పిస్తానని డ బ్బు తీసుకునే ప్రయత్నాలు చేస్తే తమ దృష్టికి తేవాలని, ఈ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు చోటులేదని తెలిపారు.

మరిన్ని వార్తలు