నెలాఖరున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం! 

12 Feb, 2020 04:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో సంస్థాగత ఎన్నికలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే కనిపిస్తోంది. ఇటు పార్టీ పదవుల్లో నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. జాతీయ పార్టీ అధ్యక్షుడి నియామకం పూర్తయిన నేపథ్యంలో జిల్లాల్లో అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇక ఎన్నికలుండే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. వచ్చే వారం రోజుల్లో జిల్లా కమిటీలకు అధ్యక్షులను నియమించేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం బూత్, గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆపై రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు, అనంతరం జాతీయ అధ్యక్షుడి నియామకం ఉండాల్సి ఉం ది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మండల కమిటీలకు కూడా పూర్తి స్థా యిలో ఎన్నికలు జరగలేదు. మరోవైపు జాతీయ అధ్యక్షుడి నియమా కం పూర్తయింది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు కాకుండా సంప్రదింపులు జరిపి నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తె లిసింది. దీంతో వచ్చే వారం రోజుల్లో అన్ని మండలాలకు, జిల్లాలకు కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. వీలైతే ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియమించే అవకా శం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తోపాటు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ప్రయత్నాల్లో ఉన్నా రు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.. ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అ ధ్యక్ష పదవిని ఎవరికిస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు