ఏడాదంతా సాఫీగా ప్రయాణం

1 Jan, 2015 00:44 IST|Sakshi
ఏడాదంతా సాఫీగా ప్రయాణం

2014లో ఆర్టీసీ మెరుగైన ఫలితాలు
ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడి

 
 సాక్షి. హైదరాబాద్: గత ఏడాది రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణం సాఫీగా సాగిందని, 2014 సంవత్సరం మొత్తమ్మీద చూసుకుంటే ఆర్టీసీకి మంచికాలంగా చెప్పవచ్చని మేనేజింగ్ డెరైక్టర్ డీజే పూర్ణచందద్రరావు తెలిపారు. నష్టాలను చాలావరకు తగ్గించుకోగలిగామని, బంద్‌లు, సమ్మెల కారణంగా రూ. 1300 కోట్ల నష్టం వచ్చినా గతంలో పోల్చుకుంటే తక్కువేనని అన్నారు.
 
 బుదవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీజిల్ ధరలు తగ్గిన కారణంగా సంస్థకు లాభం చేకూరిందని, అయినా ఇప్పటికీ రోజుకు రూ. 3 కోట్ల నష్టంతో సంస్థ నడుస్తోందని చెప్పారు. 2015 సంవత్సరంలో ప్రయాణికులకు మరింత సుఖమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కొత్త పథకాలను అందుబాటులోని తెస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ మీకోసం, తెలంగాణలో ఆర్టీకీ మీకు తోడు అని పేర్లను ఖరారు చేశామన్నారు. ఏపీలో సంక్రాంతి రోజుల్లోనూ బస్సులు నడుస్తాయని, దీనిపై ఆందోళన అవసరం లేదని చెప్పారు.
 
 నెలరోజుల్లో ఆర్టీసీ విభజన పూర్తి
 రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థల విభజన ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని పూర్ణచంద్రరావు తెలిపారు. జనవరి తొలి వారంలో ఈడీల కమిటీ సమావేశం నిర్వహిస్తామని, అనంతరం ఢిల్లీలో షీలా బేడి కమిటీకి నివేదిక అందజేస్తామని చెప్పారు. జనవరి నెలాఖరుకు కేంద్రం నుంచి  విభజనకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు