శంఖారావానికి ఏర్పాట్లు..

15 Mar, 2019 16:36 IST|Sakshi
సభాస్థలిని పరిశీలిస్తున్న మంత్రులు, తదితరులు 

 రెండున్నర లక్షల జనసమీకరణకు దిశానిర్దేశం

స్పోర్ట్స్‌స్కూల్‌ మైదానంలో కేసీఆర్‌ సభ

కరీంనగర్‌లోనే మంత్రులు, ఎమ్మెల్యేల మకాం    

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని మో గిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొనే తొలి బహిరంగసభను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నా యకత్వం ఏర్పాట్లు చేస్తోంది. కలిసొచ్చిన ఉద్యమగడ్డ కరీంనగర్‌ నుంచే కేసీఆర్‌ ఈనెల 17న లోక్‌సభ ఎన్నికల సమరానికి తరలివస్తున్నందున గతంలో కన్నా భారీగా సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

ఈమేరకు గురువారం మం త్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ బి.వినోద్‌కుమార్, జిల్లా పార్టీ ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, స్థానిక కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు సమావేశమై కార్యాచరణను రూపొందించారు. మానేర్‌డ్యాం దిగువన సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌లో సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

తొలుత తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో సభ జరపాలని భావించినా, ఆ స్థలం సభ నిర్వహణకు అనువుగా లేకపోవడంతో స్పోర్ట్స్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌కు వేదికను మార్చారు. 2.5 లక్షల మందితో సభను నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ, సభాప్రాం గణం విస్తీర్ణం సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తొలిసభను ఘనంగా నిర్వహిం చడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ సంకేతాలు పంపించాలనే లక్ష్యంతో జిల్లా నాయకులు ప్రణా ళికలు రూపొందించారు.

కరీంనగర్‌ శివారులో ఎటు చూసినా జనం కనిపించేలా సభను దిగ్విజయం చేయాలనే లక్ష్యంతో నేతలు ముందుకుసాగుతున్నారు.పార్టీ నేతల మధ్య సమన్వయం, మండలాల వారీగా సభకు జనాన్ని తరలించడం వం టి కార్యక్రమాలు నిరాటంకంగా సాగేలా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జీలను నియమించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకువచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యేలకు పనులు అప్పగించారు. సభను విజయవంతం చేయడంలో ఎమ్మెల్యేలదే కీలకపాత్ర.


కరీంనగర్‌ నియోజకవర్గం నుంచే 50వేల జనం
కేసీఆర్‌ పాల్గొనే కరీంనగర్‌సభకు కేవలం కరీంనగర్‌ నియోజకవర్గం నుంచే 50వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ బాధ్యత తీసుకున్నారు. ఆయన బుధవారం రాత్రి ఓ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసి మునిసిపల్‌ కార్పొరేటర్లకు టార్గెట్లు ఇచ్చారు.

మునిసిపల్‌ మేయర్‌ సర్ధార్‌ రవీందర్‌సింగ్‌ జనసమీకరణలో కీలకంగా వ్యవహరించనున్నారు. 50 డివిజన్‌లు ఉన్న కార్పొరేషన్‌లో ఒక్కో డివిజన్‌ నుంచి వెయ్యి మంది హాజరైన సభతోపాటు కరీంనగర్‌ రోడ్లు కిటకిటలాడతాయి. సిరిసిల్ల, వేములవాడ నుంచి బైపాస్‌రోడ్డులో నేరుగా సభాస్థలి ప్రాంతానికే వాహనాలు వస్తాయి.

మానకొండూరు, హుజూ రాబాద్, హుస్నాబాద్‌ నుంచి వచ్చే వాహనాలకు మానేర్‌డ్యామ్‌లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. చొప్పదండి, ధర్మపురి నుంచి వచ్చే వాహనాలకు సైతం సమీపంలోనే పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నా రు. కరీంనగర్‌ మినహా ఆరు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందిని తరలించాలని గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు.


నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలు
సభను విజయవంతం చేయడంతోపాటు జనసమీకరణలో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకునేలా నియోజకవర్గానికి ఇద్దరు ఇన్‌చార్జీలను నియమించారు. హుజూరాబాద్‌కు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మానకొండూరుకు పుట్ట మధు, సత్యనారాయణగౌడ్, సిరిసిల్లకు బాల్క సుమన్, కోరుకంటి చందర్, హుస్నాబాద్‌కు తుల ఉమ, ఆరూరి రమేశ్, ధర్మపురికి సంజయ్, కరీంనగర్‌కు కొప్పు ల ఈశ్వర్, వేములవాడకు దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నారు.


కరీంనగర్‌ నుంచే అత్యధిక మెజారిటీ: ఈటల రాజేందర్‌
ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నంటి నిలిచిన కరీంనగర్‌ ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌లో గురువారం మాట్లాడారు. కేసీఆర్‌ పాల్గొనే సభకు రెండున్నర లక్షల జనం హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణలో ప్ర స్తుతం టీఆర్‌ఎస్‌ ఎదుట నిలబడేస్థాయిలో ఏ రా జకీయ పార్టీ లేదన్నారు. ప్రజలు గులాబీ జెండా ను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ను రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

  
కేసీఆర్‌ సభాస్థలం పరిశీలన
కరీంనగర్‌: కరీంనగరంలో కేసీఆర్‌ సభను విజయవంతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. ఈనెల 17న జరిగే సీఎం సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. టీఆర్‌ఎస్‌కు అచ్చొచ్చిన కరీంనగర్‌ జిల్లా నుంచే ఎన్నికల నగారా మోగనుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభతో టీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రజాబలం మరోసారి తెలుస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

కరీంనగర్‌ శివారులోని స్పోర్ట్స్‌స్కూల్‌ మైదానంలో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనం హాజరుకానున్నారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ మైదానాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ రవీందర్‌సింగ్, పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి పరిశీలించారు. దాదాపు 30 ఎకరాల స్థలాన్ని చదునుచేయడంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మైదానం మొత్తం టెంట్లు వేయిస్తున్నారు.    

మరిన్ని వార్తలు