ఇక సెన్సెస్‌–2021

19 Jun, 2019 09:58 IST|Sakshi
సమావేశానికి హాజరైన అధికారులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించేందుకు నిర్ధేశించిన జన గణనకు అధికార యంత్రాంగం మరోసారి సమాయత్తం అవుతోంది. పదేళ్లకోసారి జరిపే జనగణన 2011లో ముగిసింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను
రూపొందించి అమలు చేస్తున్నాయి. 2021 జన గణన కోసం ఇప్పటి నుంచే సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి నుంచి 2020 చివరి వరకు జనాభా లెక్కల ప్రక్రియ సాగుతుంది. 2021 నుంచి కొత్త లెక్కల ప్రకారం కార్యక్రమాల రూపకల్పన ఉంటుంది. కాగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతోపాటు మండలాలు, గ్రామ పంచా యతీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సెన్సెస్‌ –2021 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మంగళవారం జిల్లాకు చెందిన మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.

021 జనగణన కోసం పునర్విభజన అనంతరం ఏర్పాటైన మండలాలు, గ్రామాలు, మునిసిపాలిటీల హద్దులతో కూడిన మ్యాపులను, పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిం చారు. మ్యాపులను బుధవారంలోగా సమర్పిం చాలని అన్నారు. అన్ని గ్రామాల్లో విలేజీ రిజిస్టర్, పట్టణాల్లో టౌన్‌ రిజిస్టర్‌ నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ గ్రామాలను ప్రామాణికంగా వివరాలు సేకరించాలన్నారు. మునిసిపాలిటీలలో ఎన్నికల వార్డులను ప్రామాణికంగా తీసుకొని కాలనీలు, వార్డుల మ్యాపులతోపాటు మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ మ్యాపులు పంపిం చాలని ఆదేశించారు. మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు పంపిన మ్యాపుల ఆధారంతగా జియో ట్యాగింగ్‌తో నిర్ధిష్టమైన మ్యాపులను హైదరాబాద్‌లో రూపొందించనున్నట్లు చెప్పా రు. డిసెంబర్‌ 31లోపు మ్యాపులన్నీ సిద్ధంగా ఉంటాయని చెప్పారు. జనగణన కోసం ప్రత్యేకంగా ఎన్యుమరేటర్లను నియమిస్తామని కలెక్టర్‌ తెలిపారు. మునిసిపాలిటీలు, మండలాల నుం చి వివరాలు డూప్లికేట్‌ కాకుండా కమిషనర్లు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ లాల్, ప్రత్యేక అధికారి ప్రావీణ్య, డీఆర్‌ఓ బిక్షానాయక్, ప్రణాళిక శాఖ ఉప సంచాలకులు శక్తికుమార్, కరీంనగర్, హుజూరాబాద్‌ ఆర్‌డీవోలు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు