15 ఏళ్ల నిరీక్షణకు తెర

17 Mar, 2020 04:29 IST|Sakshi
టికెట్‌ అందిస్తున్న జనగామ శ్రీనివాస్‌

గల్ఫ్‌ నుంచి దుర్గయ్య రాకకు ఏర్పాట్లు

కోనరావుపేట: దుబాయ్‌ వెళ్లిన ఓ వలసజీవి.. అక్కడి ఏజెంట్‌ మోసానికి 15 ఏళ్లు నరకయాతన అనుభవించాడు. వీసా లేకుండా పనిచేశాడంటూ దుబాయ్‌ ప్రభుత్వం రూ.5.15 లక్షల జరిమానా విధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన దొబ్బల దుర్గయ్య రూ.80 వేలు అప్పు చేసి ఓ ఏజెంట్‌ ద్వారా 2005 లో దుబాయ్‌ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్‌ పాస్‌పోర్ట్‌ తీసుకుని వదిలేశా డు. 15 ఏళ్లు నరకం అనుభవించాడు. విషయం తెలుసుకున్న ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరం ఉపాధ్యక్షుడు జనగామ శ్రీనివాస్‌ అక్కడి అధికారులతో మాట్లాడి.. వీసా, టికెట్, అవుట్‌ పాస్‌పోర్ట్‌ ఇప్పించి ఇండియాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం దుర్గయ్య స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు