మోకాళ్లపై కూర్చుని మంత్రికి వినతి

26 Jun, 2017 02:05 IST|Sakshi
మోకాళ్లపై కూర్చుని మంత్రికి వినతి

గోవిందరావుపేట (ములుగు): భూపాలపల్లి జిల్లాలో ఐదో పోలీసు బెటాలియన్‌ ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా గోవిందరావుపేట మండలం చల్వాయి శివారులోని భూమిని తాజాగా డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు. అయితే, అది ప్రభుత్వ భూమే అయినా దశాబ్దాలుగా నిరుపేద రైతులు ఖాస్తులో ఉన్నారు. ప్రస్తుతం ఆ భూమిని బెటాలియన్‌కు కేటాయిస్తే తాము అన్యాయానికి గురవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఈక్రమంలో మండలంలోని నేతాజీనగర్‌కు మంత్రి చందూలాల్‌ రాగా ఆయనకు వినూత్న రీతిలో తమ సమస్యను రైతులు తెలియజేశారు. మంత్రి కాన్వాయ్‌ వెళ్తుండగా రైతులు మోకాళ్లపై కూర్చుని వినతిప త్రాలు చూపించారు. దీంతో మంత్రి కాన్వాయ్‌ ఆపి రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకున్నారు. తాను అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు