370 అధికరణ 1953లోనే రద్దయిందా?

3 Oct, 2019 03:08 IST|Sakshi

5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమా?

అసలు అంత ఆర్థిక వ్యవస్థ అవసరమా..?

కశ్మీర్‌ సమస్యపై మనమెందుకు ఆందోళన పడాలి..?

చిక్కు ప్రశ్నలపై ‘మంథన్‌ సంవాద్‌’

ఇలా కుతూహలాన్ని రేకెత్తించే మరిన్ని ప్రశ్న లు.. వాటికి సమాధానాలకు బుధవారం హైదరాబాద్‌లోని ‘శిల్పకళా వేదిక’సాక్ష్యంగా నిలిచింది. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సం దర్భంగా ఏర్పాటు చేసిన ‘మంథన్‌ సంవాద్‌’లో దేశంలో ప్రస్తుత పరిస్థితులు.. ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు తమ భావాలు వెల్లడిం చారు. ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలు మందగమనంపై కేంద్ర ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్‌ తన గళాన్ని వినిపించారు. కశ్మీర్‌ పరిస్థితిపై చరిత్రకారుడు శ్రీనాథ్‌ రాఘవన్‌ తనదైన విశ్లేషణ చేశారు. ఈ కాలానికి గాంధీతత్వం ఎలా అనుసరణీయమో ప్రొఫెసర్‌ సుదర్శన్‌ అయ్యంగార్‌ వివరించారు. భారత రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులేంటి.. వాటిని కాపాడుకునేందుకు అంద రూ గళమెత్తాల్సిన అవసరమేంటన్న దానిపై సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి ఉపన్యసించారు.  
 – సాక్షి, హైదరాబాద్‌ 

అందరూ రాజ్యాంగ పరిరక్షకులే
ఇంకొకరి స్వాతంత్య్రంపై నిర్బంధాలు విధిస్తే పౌరులు తమకేంటని అనుకుంటే పొరపాటేనని.. భవిష్యత్తులో అది వారి స్వేచ్ఛ ను హరించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మేనక గురుస్వామి అన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతిసారి న్యాయస్థానాల్లో సవాల్‌ చేయడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. జమ్మూ, కశ్మీర్‌లో రెండు నెలలుగా ప్రజలకు వైద్య సేవలు అందట్లేదని, అధికారాన్ని ప్రశ్నించేందుకు, హక్కులను కాపాడుకునేందుకు అందు బాటులో ఉన్న అత్యంత శక్తిమంతమైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లకూ దిక్కులేకుండా పోతోందన్నారు. ఎమర్జెన్సీ సమయం లోనూ ఈ పిటిషన్లపై 24 గంటల్లో విచారణ జరిగేదని గుర్తు చేశారు.
– మేనక గురుస్వామి

అందుకోదగ్గ లక్ష్యమే
2014–19 మధ్య కాలంలో 7.5 శాతం సగటు వృద్ధితో ముందుకెళ్తున్న భారత్‌.. ప్రధాని మోదీ ఆశిస్తున్నట్లు ఐదు ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదని కె.వి.సుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. ఈ లక్ష్యం చేరాలంటే ఏటా ఎనిమిది శాతం వృద్ధి రేటు, కొన్ని విధానపర మార్పులు అవసరమని తెలిపారు. జీడీపీపై ప్రభుత్వం ఇస్తున్న అంకెలు సరైనవేనని భావిస్తు న్నట్లు చెప్పారు. ఆర్థిక మంద గమనాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడులను ఆకర్షిం చాల్సిన అవసరముందని, ఇది ఉత్పాదకతను పెంచు తుందని.. ఫలితంగా మరిన్ని ఉద్యోగాలు, ఎగుమతులు జరు గుతాయని.. వీటన్నింటి కారణంగా వస్తు, సేవలకు డిమాండ్‌ పెరిగి ఆర్థిక వ్యవస్థ మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తుందని వివరించారు.    
– కె.వి.సుబ్రమణియన్‌

1953లోనే తూట్లు
జమ్మూ, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు సాంకేతికంగా 2019లో జరిగినా.. ఆ చట్టం తాలూకు అసలు స్ఫూర్తికి 1953లోనే తూట్లు మొదలయ్యాయని చరిత్రకారుడు, మాజీ సైనికాధికారి శ్రీనాథ్‌ రాఘవన్‌ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత ప్రధానిగా నెహ్రూ స్థానంలో సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఉండి ఉంటే కశ్మీర్‌ సమస్య వచ్చి ఉండేది కాదనే వారు.. ఆనాటి కేబినెట్‌ సమావేశాల వివరాలు చదువుకోవాలని, 370 అధికరణ రూపకల్పనలో అప్పటి రక్షణ మంత్రి అయిన వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఎంత కీలక పాత్ర పోషించారో.. అప్పటి కేంద్ర మంత్రి శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఎలా మద్దతిచ్చారో తెలుసుకోవాలని హితవు పలికారు. 1953లో షేక్‌ అబ్దుల్లాను నెహ్రూ గద్దె దింపడంతోనే 370 అధికరణ స్ఫూర్తికి తూట్లుపడటం మొదలైందని, తర్వాతి కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో భారత రాజ్యాంగం ముప్పావు వంతు అక్కడ అమల్లోకి వచ్చిందని తెలిపారు.    
– శ్రీనాథ్‌ రాఘవన్‌

ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవసరమా?
ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక, ప్రాకృతిక సమస్యలకు మహాత్మాగాంధీ ఎప్పుడో సమాధానం చెప్పారని.. ఈ కాలంలోనూ గాంధీతత్వం అనుసరణీయమన్నారు సుదర్శన్‌ అయ్యంగార్‌. మహాత్ముడి సిద్ధాం తాలను పరిపూర్ణంగా ఆచరించడం ఈ కాలపు అవసరమని తెలిపారు. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై అందరూ మాట్లాడుతున్నారని.. కానీ అది ఎందుకన్న ప్రశ్న మాత్రం ఎవరూ వేయకపోవడం శోచనీయమన్నారు. ఒకరమైన ఆందోళ నకరమైన వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో అధికారంలో ఉన్న వారికి కీలకమైన ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందన్నారు.    
– సుదర్శన్‌ అయ్యంగార్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా