నిద్రలోనే తనువు చాలించాడు

13 Mar, 2020 04:42 IST|Sakshi

అమెరికాలో కామారెడ్డి జిల్లావాసి మృతి

కరోనాతో మృతదేహం తరలింపు అనుమానమే! 

భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన భూర్ల అరుణ్‌కుమార్‌ (41) అమెరికాలో గురువారం రాత్రి మృతి చెం దాడు. జ్వరం, లోబీపీతో నిద్రలోనే తనువు చా లించాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అమెరికాలోని హోస్టన్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌.. రెండు రోజులుగా జ్వరం, లోబీపీ సమస్యతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమెరికా నుంచి కామారెడ్డిలోని తల్లితో భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు మాట్లాడారు. ‘అమ్మా నాకు దమ్ము వస్తోంది.. మాట్లాడుతుంటే ఇబ్బంది అవుతోంది, రేపు మళ్లీ మా ట్లాడుతా’అని చెప్పాడు. అరుణ్‌ మందులు వేసుకుని నిద్రకు ఉపక్రమించిన తర్వాత అతని భార్య రజనీ ఉద్యోగానికి వెళ్లింది. గంట తర్వాత ఫోన్‌ చేయగా..ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చింది. ఎంత పిలిచినా అరుణ్‌ పలుకక పోవ డంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..అప్పటికే అరుణ్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. గురువారం రాత్రి పది గంటల సమయంలో అరుణ్‌ మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు. అమెరికా ప్రభుత్వం సమ్మతిస్తే అరుణ్‌ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు హోస్టన్‌లోని ఆర్యవైశ్య సంఘాలు, వాసవీ సంస్థలు సమాయత్తమయ్యాయి.

మృతదేహం ఇండియాకు తేవడం సాధ్యం కాదు 
పలు దేశాల్లో కరోనా వ్యాధి విజృంభించడం వల్ల అమెరికా నుంచి ఇండియాకు అరుణ్‌ మృతదేహాన్ని పంపించేందుకు అక్కడి ప్రభుత్వం అను మతివ్వకపోవచ్చని తెలుస్తోంది. అరుణ్‌ అంత్యక్రియలను అక్కడే నిర్వహిస్తారని చెబుతున్నారు. అరుణ్, రజనీ తల్లిదండ్రులు గురువా రం వేకువ జామున 3 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా