అభివృద్ధికి ప్రతిబింబంగా ‘డిజిటల్ తెలంగాణ’

15 Nov, 2016 03:25 IST|Sakshi
అభివృద్ధికి ప్రతిబింబంగా ‘డిజిటల్ తెలంగాణ’

ట్రేడ్ ఫెరుుర్‌లో రాష్ట్ర పెవిలియన్‌ను ప్రారంభించిన మంత్రి చందూలాల్

 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రారంభమైన 36వ భారత అంతర్జాతీయ ట్రేడ్ ఫెరుుర్‌లో తెలంగాణ రాష్ట్రం ’డిజిటల్ తెలంగాణ’ పేరుతో ఏర్పాటు చేసిన పెవిలియన్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. సోమవారం ప్రారంభమైన ట్రేడ్ ఫెరుుర్‌లో తెలంగాణ పెవిలియన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చందూలాల్ మాట్లాడుతూ టీ-హబ్ నమూనాతో తీర్చిదిద్దిన పెవిలియన్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని స్పష్టంగా చాటేలా ఉందన్నారు. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ ఐటీ అనే మూడు అంశాలు డిజిటల్ తెలంగాణ త్రీడీ డిజైన్‌లో ప్రముఖంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారన్నారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి, ప్రపంచ స్థారుు సంస్థలు తెలంగాణలో ఏర్పాటు కావడం, వాటికి కల్పిస్తున్న సదుపాయాలను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. చందూలాల్ వెంట ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్ర తేజోవత్, కేఎం సహాని తదితరులున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో రాష్ట్ర చేనేతాభివృద్ధి సంస్థ, హస్తకళలు, పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారుు. ఈ నెల 27 వరకు కొనసాగనున్న ఈ ఫెరుుర్‌లో 21వ తేదీన ఒగ్గు డోలు, పేరిణి నృత్యం, ఖవ్వాలీ, కొమ్ము కోయ వంటి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు