పేదరికం ఆధారంగా రిజర్వేషన్లివ్వండి

14 Sep, 2015 03:41 IST|Sakshi
పేదరికం ఆధారంగా రిజర్వేషన్లివ్వండి

మంచిర్యాల టౌన్ : కులం ఆధారంగా కాకుండా, పేదరిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘త్రోన్ అవుట్ గాంధీస్ ఫౌండేషన్’(టీవోజీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల ఓవర్‌బ్రిడ్జ్ వద్ద దాదాపు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఐబీ చౌరస్తా మీదుగా ఐబీ విశ్రాంతి భవనం వరకు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా త్రోన్ అవుట్ గాంధీస్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసర్ల అరవిందరెడ్డి మాట్లాడుతూ  అగ్రవర్ణాల్లోనూ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలున్నారని తెలిపారు.

కుల రిజర్వేషన్లకు బలవుతున్నది వారేనన్నారు.అక్టోబర్ 2న వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలన్నారు. త్వరలోనే దండి మార్చ్ పేరిట దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టనున్నామని తెలి పారు. కార్యక్రమంలో త్రోన్ అవుట్ గాంధీస్ ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు న్యాలకొండ దీక్షిత్‌రెడ్డి, సలహాదారుడు ఊకంటి ప్రభాకర్‌రెడ్డి, కరీంనగర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సభ్యులు ఉమర్, అనీల్, అశోక్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, నవీన్, రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం నాయకులు బొమ్మ సత్తిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు సిరిపురం రాజేశ్, వాసవీ యువజన అధ్యక్షుడు కాచం సతీశ్, రాష్ట్ర కార్యదర్శి ముక్త శ్రీనివాస్, వాసవీ క్లబ్ అధ్యక్షుడు చొక్కారపు శ్రీనివాస్, సభ్యులు చిలువేరు నాగేశ్వర్‌రావు, డాక్టర్ జైన రామకృష్ణ, కొండ చంద్రశేఖర్, కొత్త రాజేశం, కొత్త జయప్రకాశం పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు