ఆశప్ప గ్యాంగ్ అరెస్ట్

5 Jul, 2015 01:33 IST|Sakshi
ఆశప్ప గ్యాంగ్ అరెస్ట్

పిస్తోలు, కారు స్వాధీనం
తిరుమలగిరి:
ఫ్యాక్షనిస్ట్ ఆశప్ప గ్యాంగ్‌ను అరె స్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రాజు తెలిపారు. శనివారం ఆయన  విలేకరులకు కేసు వివరాలు తెలిపారు. తిరుమలగిరి స్టేషన్, నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆశప్ప అలియాస్ అశోక్ గ్రూప్ పట్టుబడింది. వీరి వద్ద ఓ పిస్తోల్, పది బుల్లెట్లతో పాటు ఓ స్విఫ్ట్ డిజైర్ కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్ మండలం అవాంగపూర్ గ్రామానికి చెందిన ఆశప్ప (40), సత్యనారాయణ (30), న ల్లగొండ జిల్లాకు చెందిన కోటేశ్వర్‌రెడ్డి (45), నాగేశ్వర్‌రావు (29), కరీంనగర్‌కు చెందిన అంకాలరావు (33) ముఠాగా ఏర్పడి ఫ్యాక్షనిజానికి పాల్పడుతున్నట్లు వెల్లడైంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆశప్ప, చెన్నప్ప వర్గాలు 1999 నుంచి ఒకరి మీద ఒకరు తరచు దాడులు చేసుకుంటున్నారు. చెన్నప్ప అనుచరుడు సికింద్రాబాద్‌లో ఉంటున్నట్లు పసిగట్టి అతడి హత్య చేసేందుకే హైదరాబాద్‌కు వచ్చినట్లుగా వారు విచారణ తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురిని ఆదివారం రిమాండుకు తరలించనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు