హైకోర్టు సూచనతోనే సమ్మె విరమించాం

30 Nov, 2019 02:12 IST|Sakshi

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు: అశ్వత్ధామరెడ్డి

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేశారని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్ధామరెడ్డి అన్నారు. హైకోర్టు సూచన మేరకే తాము సమ్మె విరమించామని అన్నారు. శుక్రవారం వీఎస్‌టీలోని ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. తాము అడిగిన 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.

ఆర్టీసీలో భవిష్యత్‌లో యూనియన్లు ఉండవని సీఎం చెబుతున్నారని, వ్యవస్థ ఉన్నంత కాలం ట్రేడ్‌ యూనియన్లు ఉంటాయని చెప్పారు. డిపోలకు ఇద్దరు చొప్పున కార్మికులను నియమిస్తామని చెబుతున్నారని, ఇది రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. కార్మికుల ద్వారా ఓటింగ్‌ పెట్టి నిర్ణయించాలన్నారు. ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన సమ్మెలు ఎన్నడూ జరగలేదని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సమ్మెలు జరిగాయన్నారు. లేబర్‌ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు