విలీనం చేసే వరకు సమ్మె 

1 Oct, 2019 04:53 IST|Sakshi

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వద్థామరెడ్డి 

కవాడిగూడ: ప్రభుత్వంలో ఆరీ్టసీని విలీనం చేసే వరకు టీఎస్‌ఆరీ్టసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్‌ ఆశ్వద్థామరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంస్థ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం ఆశ్వద్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వచ్చిందని తెలిపారు. బస్‌ రాయితీల రూపంలో ఆరీ్టసీకి ప్రభుత్వం రూ.కోట్లల్లో బకాయి పడిందని, తక్షణమే వాటిని చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

వేతన సవరణ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 5 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు ప్రతి కారి్మకుడు మానసికంగా సిద్ధం కావాలని పేర్కొన్నారు. యూనియన్లకు అతీతంగా హక్కుల కోసం కారి్మకులు ఏకం కావాలన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కారి్మకులకు ప్రజాసంఘాలు, రాజకీయ పారీ్టలు, యూని యన్లు మద్దతు తెలిపాలని కోరారు. సకల జనుల సమ్మె సమయంలో రావాల్సిన జీత భత్యాల సవరణ చేయాలని అన్నారు. 

మరిన్ని వార్తలు