'అమాయకులను సీఎం మీటింగ్‌కు పంపిస్తున్నారు'

30 Nov, 2019 16:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో 53 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సహకరించిన రాజకీయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలకు ఆర్టీసీ జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.రేపు ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని కార్మికులను ఆదుకోవాలని పేర్కొన్నారు.  డిపోల నుంచి అమాయకులను ఏంచుకొని సీఎం మీటింగ్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. అధికారులతో కాకుండా ప్రశాంత వాతావరణం లో ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించాలని కోరారు. రాజ్యాంగం ప్రకారమే కార్మిక సంఘాలు నడుస్తున్నాయి. సెక‌్షన్‌ 19 కింద ఎవరైనా ట్రేడ్‌ యూనియన్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినా యాజమాన్య దమనకాండ ఇంకా కొనసాగుతోందని విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం కోర్టు నిబంధనల ప్రకారం నడుచుకుంటే మంచిదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు